8 రోజుల్లో డీసెంట్ రన్ తో కలెక్షన్స్ రాబట్టిన రంగ్ దే....

Purushottham Vinay
యూత్ స్టార్ నితిన్ గతేడాది "భీష్మ" సినిమాతో మంచి హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది క్రియేటివ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో "చెక్ " సినిమాతో వచ్చి నిరాశపరిచాడు.ఎన్నో అంచనాలతో వచ్చిన ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'రంగ్ దే'. 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ కావడం మరో విశేషం. మార్చి 26న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ లభించడంతో మంచి ఓపెనింగ్స్ నే సాధించింది.అయితే వీక్ డేస్ లో మాత్రం ఈ చిత్రం తడబడింది.అయితే 8వ రోజున కొత్త సినిమాలు విడుదలైనప్పయిటీకి ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లను సాధించడం విశేషం.ఇక ఈ సినిమా 8 రోజుల్లో ఎంతవరకు వసూలు చేసిందంటే..'రంగ్ దే' చిత్రానికి 23.9కోట్ల బిజినెస్ జరిగింది.


కాబట్టి బ్రేక్ ఈవెన్ కు 24.4కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 15.90 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాదించాలి అంటే మరో 8 కోట్ల షేర్ ను రాబట్టాలి.ఇక టార్గెట్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఈ వీకెండ్ ను గట్టిగా క్యాష్ చేసుకుంటే తప్ప.. అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. చూడాలి మరి ఈ సినిమా అంత రాబడుతుందో లేదో. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: