సమంత అక్కినేని గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు....?

kalpana
తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో  తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగు ప్రముఖ కథానాయికగా ఎదిగింది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షుకులకి పరిచయం అయిన సమంత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు ఇటు తెలుగు,అటు తమిళ్ ఇండస్ట్రీ ని ఏలుతున్న సమంతా అక్కినేని వారసుడు ‘నాగ చైతన్య’ ని పెళ్లి చేసుకున్న తరువాత కూడా తన సినీ ప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.సమంత గారు సినిమాలతోనే ప్రేక్షకులకి దగ్గరవడమే కాకుండా సామాజిక సేవలోను తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు.



సమంత అక్కినేని .. టాలీవుడ్‌లో ఏమాయ చేసావే సినిమాతో అడుగుపెట్టి.. ఆ తర్వాత తన తొలి సినిమా హీరో నాగ చైతన్యనే ప్రేమించి పెళ్లి చేసుకొని.. సినీ ఇండస్ట్రీకి చెందిన అక్కినేని ఫ్యామిలీ కోడలైంది. నటిగా సమంత..  రీసెంట్‌గా  11 యేళ్ల  కెరీర్ కంప్లీట్ చేసుంది. ఈ పదకొండేళ్ల కాలంలో సమంత ఎన్నో సూపర్  హిట్ చిత్రాల్లో నటించిన  సమంత మొదటి తెలుగు సినిమా..నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ మాయ చేశావే’ ఈ సినిమాలో జెస్సీ..గా సమంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. ముఖ్యంగా అప్పటి యూత్ జెస్సీ మాటలకు, ఆమె అందానికి పడి పోయి..ఆ సినిమాను పదే పదే చూసిన సందర్బాలున్నాయి.


ఆ సినిమా బంపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ ‘బృందావనం’లో ఇందుగా.. గ్లామర్ పాత్రలో మెరిసింది. ఆ తర్వాత మహేష్ బాబు ‘దూకుడు’లో మోడల్ ప్రశాంతిగా మెప్పించింది. ఈ మధ్యకాలంలో కొన్ని తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా సత్తా చాటింది.హీరోయిన్‌గా టాప్ పొజిషన్‌లో ఉండగానే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.చాలా మందికి సమంత అక్కినేని సినిమాల గురించి అక్కినేని ఫ్యామిలీ గురించి తెలుసు కానీ.. ఆమె పర్సనల్ విషయాల గురించి చాలా తక్కువ మందికే తెలుసు.సమంత అక్కినేని నాన్న వాళ్ల ప్రభు తెలుగు వాళ్లు. వాళ్ల అమ్మ నివెట్ ది మాత్రం కేరళ. కానీ సమంత వాళ్ల ఫ్యామిలీ మాత్రం చెన్నైలో స్థిరపడ్డారు.ఓ రకంగా సమంత పుట్టినిల్లు.. మెట్టినిల్లు రెండు తెలుగు గడ్డే కావడం విశేషం.



సమంత వాళ్ల అమ్మా నాన్నలకు జోనాథన్, డేవిడ్ తర్వాత సమంత మూడో సంతానం. కుటుంబంలో ఈమె చిన్నది కావడంతో తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు.సమంత అక్కినేని బాల్యం, విద్యాభ్యాసం మొత్తం చెన్నైలో జరిగింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ చేసారు సమంత.ఆ టైమ్‌లోనే ప్రముఖ దర్శకుడు రవి వర్మన్ తను తీయబోయే తమిళ సినిమా ‘మాస్కోవిన్ కావేరి’లో హీరోయిన్‌గా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు.తమిళంలో ఆ సినిమా కంటే ముందు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏమాయ చేసావే’ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత సమంత కథానాయికగా వెనుదిరిగి చూసుకోలేదు.


కెరీర్ పీక్స్‌లో ఉండగానే తోటి హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్‌గా కెరీర్‌ను కూడా కంటిన్యూ చేసింది.సమంత ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్‌ తో పాటు సాకీ పేరుతో దుస్తుల బ్రాండ్‌ను స్టార్ట్ చేసింది. దాంతో పాటు ‘ఆహా’లో సామ్ జామ్ అంటూ యాంకర్ అవతారం కూడా ఎత్తింది.  అంతేకాదు స్నేహితులతో కలిసి ఓ స్కూల్‌ను కూడా స్టార్ట్ చేసింది.ప్రస్తుతం సమంత అక్కినేని ’శాకుంతలం’ అనే పౌరాణికం సినిమా చేస్తోంది. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా  షూటింగ్ పూజా కార్యక్రమాలతో  మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: