సోనూ సూద్ పేరుతో మోసాలు..!

MADDIBOINA AJAY KUMAR
సినిమాల్లో విల‌న్ పాత్ర‌లు చేసే  సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం రియ‌ల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు తో పాటు హిందీ, త‌మిళ సినిమాల్లో న‌టించిన సోనూసూద్ లాక్ డౌన్ వేల ఎంతోమందికి స‌హాయం చేసి వార్త‌ల్లో నిలిచాడు. సోనూ సూద్ చేత స‌హాయం పొందిన వారి గుండెల్లో నిలిచాడు. లాక్ డౌన్ త‌ర‌వాత కూడా సోనూసూద్ త‌న స‌హాయ కార్య‌క్ర‌మాలను కొన‌సాగిస్తున్నాడు. ఏపీలో ఓ రైతు కాడెద్దులు లేక త‌న కూతుల్ల స‌హాయంతో పొలం దున్న‌డం సోషల్ మీడియాలో చూసిన సోనూసూద్ వెంటనే స్పందించి సాయంత్రానిక‌ల్లా ట్రాక్ట‌ర్ ను పంపిస్తాన‌ని వారికి హామీ ఇచ్చాడు. అంతే కాకుండా చెప్పిన‌ట్టుగా నే సాయంత్రానికల్లా వారింటికి ట్రాక్టన్ పంపించి ఆదుకున్నాడు. ఇటీవ‌ల సిద్ధిపేట కు చెందిన ఓ చిన్నారి గుండె సంభంధిత వ్యాధితో బాధ‌ప‌డుతుంద‌ని తెలిసిన సోనూసూద్ తానే ద‌గ్గ‌రుండి ముంబైలో ఆప‌రేష‌న్ చేయించాడు. అంతే కాకుండా ఇటీవ‌ల సోనూ త‌న సొంత డబ్బుతో అంబులెన్స్ ల‌ను ప్రారంభించాడు. 


ఇవి సోనూసూద్ తెలుగురాష్ట్రాల్లో చేసిన సేవ‌లు మాత్ర‌మే దేశ‌వ్యాప్తంగా ఎన్నో సేవాకార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న చేస్తూ ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. అయితే సోనూ చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల‌ను అత‌డికి ఉన్న క్రేజ్ ను కొంత మంది కేటుగాళ్లు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. తాజాగా ఓ కేటుగాడు సోనూ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.  ట్విట్టర్ లో సోనూసూద్ కార్పొరేట్ సంస్థ పేరు మీద ఆశిష్ కుమార్ అనే వ్యక్తి ఖాతాను తెరిచారు. ఈ ఖాతాకు తమకు సహాయం చేయాలంటూ పెద్ద ఎత్తున బాధితులు రిక్వెస్ట్ లు పెడుతున్నారు. దాంతో సహాయం చేయిస్తానని చెప్పి ఆశిష్ కుమార్ పెద్ద ఎత్తున బాధితుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు.  దాంతో ఆశిష్ కుమార్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: