చంటి ఇరగదీసాడు పో.. కమల్ హాసన్ ను దింపేసాడు..?
ఇకపోతే జబర్దస్త్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా జబర్దస్త్ లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకుని ఇక తనదైన శైలిలో కామెడీ పంచులు వేస్తూ.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు చలాకి చంటి. కొన్నాళ్లపాటు జబర్దస్త్ కి గ్యాప్ ఇచ్చిన చంటి ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు అయితే ఇటీవలే విడుదలైన జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమో లో భాగంగా చలాకి చంటి చేసిన స్కిట్ కాస్త ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా ఆకర్షనీయం గా మారిపోయింది.
కమల హాసన్ హీరోగా నటించిన సాగరసంగమం సినిమా స్పూఫ్ చేశాడు చలాకి చంటి. ఈ క్రమంలోనే ఇక స్కిట్ స్టార్ట్ కాగానే సాగర సంగమం సినిమాలోని రే రేలా గోపెమ్మల అనే పాట పై డాన్స్ చేసిన చలాకి చంటి అచ్చం కమలహాసన్ ను దింపేసాడు. దీంతో అటు జడ్జెస్ కూడా ఫిదా అయిపోయారు. ఆ తర్వాత తనదైన శైలిలో డాన్స్ చేసి అటు బుల్లితెర ప్రేక్షకులందరికీ కామెడీని పంచాడు అనే చెప్పాలి. ఏదేమైనా మరోసారి చలాకి చంటి సరికొత్త స్కిట్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది. ప్రోమోలో చలాకి చంటి స్కిట్ చూసిన తర్వాత ఇక మొత్తం స్కిట్ చూడటానికి బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.