జబర్దస్త్ బ్యూటీ యాంకర్ అనసూయ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. జబర్ధస్త్ తో పాటు ఇతర టీవీ షోలతోప ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు సినిమాల్లో రానిస్తోంది. రంగస్తలం సినిమాలో అనసూయ నటన చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అనసూయలో ఇంత టాలెంట్ దాగి ఉందా అనుకున్నారు. అంతే కాకుండా పలువురు డైరెక్టర్లు సైతం అనసూయ నటను చూసి అవాక్కయ్యారు. ఇంకే ముంది ప్రస్తుతం టాలీవుడ్ లో నటిగా కూడా ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఇటీవలే అనసూయ కార్తికేయ హీరోగా నటించిన చావు కబురు చల్లగా సినిమాలో ఐటమ్ సాంగ్ తో అలరించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడీ సినిమాలోనూ ఈ బ్యూటీ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ ను కూడా అనసూయ పూర్తి చేసుకుంది. షూటింగ్ సమయంలో అనసూయ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అయ్యాయి.
ఇక సినిమాలతో టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉండే అనసూయ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో గడుపుతుంది. కొత్త కొత్త ఫోటో షూట్ లతో ఫ్యాన్స్ కు అందాల విందు వడ్డిస్తుంది. అంతే కాకుండా అప్పుడప్పుడూ లైవ్ లోకి వచ్చి ఫ్యాన్స్ తో ముచ్చటిస్తు ఉంటుంది. మరోవైపు టిక్ టాక్ వీడియలు కూడా చేస్తూ అరిస్తూ ఉంటుంది. ఇక తాజాగా అనసూయ చేసిన ఓ వీడియోకు అభిమానులు తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఒక లైలా కోసం సినిమాలో పూజా హెగ్డే నాకు ఎందుకు ప్రపోజ్ చేయలేదురా బాబు అంటూ ఓ డైలాగ్ కొడుతుంది. ఇప్పడు అదే వీడియోను అనసూయ తన స్టైల్ లో చేసింది. అనసూయ అడిగితే కాదనే వారు ఉంటారా. ఇక ప్రపోజ్ ల వర్షం కురుస్తోంది. కొంతమంది ఐ లవ్ యూ అనసూయ అంటూ కామెంట్స్ పెడుతుండగా..మరి కొందరు నీకు పెళ్లి అయింది కదా ప్రపోజ్ చేస్తే ఒప్పుకోరేమో అని చేయలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.