వర్ష, ఇమ్మానియేల్ పెళ్లి.. హాజరైన జబర్దస్త్ టీమ్..?
వర్ష ఇమాన్యుల్ జంట ప్రస్తుతం జబర్దస్త్ లో అందరినీ ఆకర్షిస్తూ ఎంతగానో క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతుంది. ఒకప్పుడు రష్మీ సుధీర్ జంట ఎలాగైతే ఫేమస్ అయిందో ఇప్పుడు కూడా వర్ష ఇమ్మానియేల్ జంట అదే పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ టీవీ లో ఏ కార్యక్రమంలో చేసిన ఇద్దరే స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోతున్నారు అయితే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నిజంగానే పెళ్ళి చేసుకున్నారు అని తెలుస్తోంది. ఏంటి ఆశ్చర్య పోతున్నారు కదా.
వీరిద్దరూ పెళ్లి చేసుకుంది నిజజీవితంలో కాదు ఇటీవల జబర్దస్త్ స్కిట్ లో భాగంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కెవ్వు కార్తిక్ స్కిట్ లో భాగంగా వర్ష ఇమాన్యుల్ ఇద్దరూ కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గెటప్ లో వచ్చారు. వీరిని ఆశీర్వదించడానికి జబర్దస్త్ లో ఉన్న కమెడియన్స్ అందరూ వచ్చారు. ఈ క్రమంలోనే పెళ్లి డ్రెస్ లో వచ్చిన ఇద్దరు జంట తమదైన శైలిలో కామెడీ చేసి బుల్లితెర ప్రేక్షకులను అలరించారు.