టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్
హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట్లో సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు చేసిన కాని "ఏజెంట్ సాయి
శ్రీనివాస్ ఆత్రేయ " సినిమాతో హీరోగా పరిచయమయ్యి ఆ సినిమాతో మంచి
బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఇక ఆ
సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని 'జాతి రత్నాలు'
సినిమా చేసాడు. ఆ సినిమాలో నవీన్ కి జంటగా ఫరియా అబ్దుల్లా నటించింది. ఇక 'జాతి రత్నాలు' చిత్రం
మార్చి 11న విడుదలయ్యింది. కె.వి.అనుదీప్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి షోతోనే హిట్ టాక్ లభించడంతో.. ముందు నుండీ ఉన్న హైప్ కారణంగా 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్ట్ లోకి చేరింది. 'స్వప్న సినిమా' బ్యానర్ పై 'మహానటి' దర్శకుడు
నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. 25 రోజులు పూర్తయినప్పటికీ ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లను రాబడుతోంది.నిర్మాతలకు గట్టి లాభాలను తెచ్చి పెట్టి ఇంకా వసూళ్ల సునామి సృష్టిస్తుంది...
ఇక 'జాతి రత్నాలు' 25 రోజుల కలెక్షన్ల వివరాలను ఓ సారి గమనిస్తే...'జాతి రత్నాలు' చిత్రానికి 10.8 కోట్ల థియేట్రికల్
బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 11.3కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా…ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే కంప్లీట్ చేసి 25 రోజులకు గాను ఏకంగా 38.40 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం కొన్న బయ్యర్లు ఇప్పటివరకూ 27.10 కోట్ల లాభాలను పొందారు. ఇటీవల కాలంలో ఈ రేంజిలో లాభాలు అందుకున్న
సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాతో నవీన్ స్థాయి కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం
ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...