టాలీవుడ్ డెబ్యూకు సిద్ధమైన బాలీవుడ్ యంగ్ హీరోయిన్...!

VAMSI
ఒకప్పుడు బాలీవుడ్ లోకి టాలీవుడ్ సెలబ్రిటీలు వెళ్ళాలన్నా...బాలీవుడ్ హీరో,హీరోయిన్లు తెలుగు సినిమాల్లోకి రావాలన్నా అంత చిన్న విషయమేమీ కాదు. బాలీవుడ్ సినీ పరిశ్రమకు ఏమాత్రం తక్కువ కాదన్న స్థాయికి టాలీవుడ్ సినీ పరిశ్రమ చేరుకుంది. దాంతో ఈ మధ్య కాలంలో హిందీ చలన చిత్ర పరిశ్రమలోని పలువురు టాప్ హీరో మరియు హీరోయిన్లు మన తెలుగు సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొందరు హిందీ బడా సెలబ్రిటీలు ఇక్కడ సినిమాల్లో నటించగా...మరికొందరు చేస్తున్నారు. ఇపుడు ఇదే లిస్ట్ లో చేరింది మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ ... మితిలా పాల్కర్.
తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా 'ఓ మై కడవులే' తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో  మితిలా తొలిసారిగా తెలుగులోకి  అడుగు పెట్టనుంది. టాలీవుడ్ వైవిధ్య భరిత నటుడు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా.. ఇటీవలే ఇందులో హీరోయిన్ గా  మితిలా షూటింగ్ లో జాయిన్ అయింది. కామెడీ ప్రధాన ఇతివృత్తంగా రూపుదిద్దుకుంటున్న  ఈ చిత్రంలో మితిలా.. తమిళంలో రితికాసింగ్ చేసిన పాత్రలో కనిపించనుంది.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ పీవీపీ సినిమా బ్యానర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది కానీ ఇంకా టైటిల్ ఖరారు చేయకపోవడం ఆశ్చర్యపరిచే విషయం.
ఇక తమిళంలో ఒరిజినల్  'ఓ మై కడవులే' చిత్రానికి దర్శకత్వం వహించిన అశ్విన్ మరిముత్తు... ఇప్పుడు  తెలుగు రీమేక్ దర్శక భాద్యతలను తీసుకున్నాడు. ఈ చిత్రానికి మన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాటలు అందించబోతుండడం మరో విశేషం. ఫుల్ పాపులారిటీ పెంచుకున్న బాలీవుడ్ అందాల తార మితిలా పాల్కర్ తెలుగులో కూడా తన క్రేజ్ అంతకంతకూ పెంచుకుంటుంది ఏమో చూడాలి. కాగా ప్రెతియూతం విశ్వక్ సేన్ పలు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఇటీవల పాగల్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: