సారంగదరియా పాట పై ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల.. ఎందుకో తెలుసా..?
అయితే శేఖర్ కమ్ముల సినిమాలో స్టొరీ తో పాటు పాటలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇక స్టోరీ కి తగ్గట్టుగా పాటలు ఉండడమే కాదు అవి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలనాలు సృష్టిస్తూ ఉంటాయి పాటలు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నాగచైతన్య సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాట టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సారంగదరియా పాట ప్రస్తుతం ప్రతి ఒక్క ప్రేక్షకుడి నోటా నానూతూనే ఉంది.
అయితే సారంగదరియా పాట టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారి పోవడమే కాదు ఈ పాట పై అటు పలు వివాదాలు కూడా చెలరేగాయి.. చెప్పకుండా తన పాటను కాఫీ చేశారు అంటూ కొంతమంది వ్యక్తులు వివాదాన్ని తెరమీదికి తెచ్చారు. ఇక ఆ తర్వాత శేఖర్ కమ్ముల వారికి సర్దిచెప్పడంతో వివాదం కాస్త ముగిసింది. అయితే ఇటీవల సారంగదరియా పాట పై శేఖర్ కమ్ముల ఎమోషనల్ అయ్యారు. ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన శేఖర్ కమ్ముల సారంగదరియా పాట ప్లే చేస్తున్న సమయంలో ఇక అది చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ పాటను ఎంతో సొంపుగా రైటర్ రాశారని కానీ వివాదం కారణంగా ఆయన బాధపడటం తనను ఎంతగానో కలిచివేసింది అంటూ శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడు.