బన్నీ ఐకాన్ స్టార్.. ఎందుకో చెప్పిన దర్శకుడు సుకుమార్..?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. స్టార్ నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత తన టాలెంట్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఏకంగా టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు.  తన డాన్స్ పర్ఫార్మెన్స్ లో తన నటనతో కూడా ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించి అభిమానులను సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.  అయితే గత ఏడాది త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన అలా వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ఇక అదే జోష్ లో తన మరో హిట్ డైరెక్టర్ అయిన సుకుమార్ తో కలిసి సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.



 ఈసారి ఇప్పటివరకూ తన కెరీర్లో నటించనీ ఒక వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. ఏకంగా ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. సుకుమార్ సినిమా అంటే కాలిక్యులేషన్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో క్యాలిక్యులేషన్ ఎలా ఉంటాయని అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇటీవలే పుష్పరాజ్ అనే పాత్రను పరిచయం చేస్తూ ఒక వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఈ వీడియోలో అల్లు అర్జున్ ను చూసి అటు అభిమానులు అందరూ ఆశ్చర్యపోతున్నారు.  అయితే ఈ వీడియో చివర్లో ఇక అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ కాకుండా ఐకాన్ స్టార్ అంటూ సరికొత్త స్టార్ డమ్ ఇచ్చాడు దర్శకుడు సుకుమార్.


 అయితే స్టైలిష్ స్టార్ ను ఐకాన్  స్టార్ గా ఎందుకు మార్చారు అని ఎవరికీ అర్థం కాలేదు దీనికి సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ కూడా కొనసాగుతుంది. అయితే ఇటీవలే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ కాదు ఐకాన్ స్టార్ అంటూ అసలు విషయాన్ని బయట పెట్టాడు దర్శకుడు సుకుమార్. ఇటీవలే బన్నీ పుష్ప ఫస్ట్ మీట్లో మాట్లాడిన దర్శకుడు సుకుమార్.. బన్నీకి స్టైలిష్ స్టార్ అని ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు కానీ పుష్ప సినిమా చేసిన తర్వాత ప్రామిస్ గా చెబుతున్నాను ఆయన నటన చూసిన తర్వాత ఆయనకు కేవలం స్టైలిష్ స్టార్ అని ఒక్కటే ఉంటే సరిపోదు అని అనిపించింది..  అల్లు అర్జున్ ఒక ఐకాన్ స్టార్ అంటూ  పొగడ్తలతో ముంచెత్తాడు దర్శకుడు సుకుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: