సుడిగాడు, బ్రదర్ అఫ్ బొమ్మాలి వంటి కామెడీ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన మోనాల్ గజ్జర్ ఆ తర్వాత అవకాశాలు లేక తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. అయితే ఈ గుజరాతి ముద్దుగుమ్మ తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కూడా రాని పాపులారిటీ బిగ్‌బాస్ షో ద్వారా ఆమెకు లభించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో పాటు అఖిల్ సార్థక్ తో బీభత్సమైన రొమాన్స్ చేసి దాదాపు 2-3 నెలల పాటు ఆమె తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. హౌజులో ఉన్నంత కాలం ప్రేక్షకులు ఆమెపై విమర్శలు గుప్పించారు కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కెరీర్ పరంగా ఆమె ఎంతగానో లాభపడ్డారు. అల్లుడు అదుర్స్సినిమాలో ఆమెకు ఒక స్పెషల్ సాంగ్ చేసే అవకాశం కూడా లభించింది.
అలాగే ప్రస్తుతం ఆమె స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న డాన్స్ ప్లస్ ప్రోగ్రాంలో జడ్జి గా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్ లో ఆమె ఎలా రొమాన్స్ చేసి ఎంటర్టైన్ చేశారో ఇప్పుడు కూడా డాన్స్ ప్లస్ లో అదే తరహాలో రొమాన్స్ చేస్తూ అలరిస్తున్నారు. యష్ మాస్టర్ తో సహా ఆమె చాలామందితో డాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఐతే తాజాగా ఆమె ఒక కుర్ర మాస్టార్ తో కూడా కలిసి డాన్స్ వేశారు. అయితే అనూహ్యంగా ఆ కుర్ర మాస్టర్ మోడల్ గజ్జర్ ని ముద్దు పెట్టుకొని అందరికీ షాకిచ్చాడు.
డాన్స్ ప్లస్ షో కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదల కాగా.. ఆ ప్రోమోలో కన్నా మాస్టార్ మోనాల్ తో డాన్స్ వేస్తూ ఆమె చేతిపై ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఆ షో వ్యాఖ్యాత ఓంకార్ తో సహా మెంటర్స్ అందరూ షాక్ అయ్యారు. 2 వారాల క్రితం కన్నా మాస్టార్ టీమ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన మోనాల్.. కన్నా మాస్టర్ ని తీసుకెళ్లి తన కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ సమయంలో షో నిర్వాహకులు ఒక రొమాంటిక్ సాంగ్ వేసి వారిద్దరి మధ్య బీభత్సమైన కెమిస్ట్రీ పండించారు. ఈ క్రమంలోనే కన్నా మాస్టర్ మాట్లాడుతూ మోనాల్ కోసం ఏదైనా చేస్తానని.. మోనాల్ కిష్టమైన పంచ కూడా కట్టుకొని వస్తానని చెప్పాడు. అయితే రెండు వారాల క్రితం మాట ఇచ్చిన కన్నా మాస్టర్ ఈవారం నిజంగానే పట్టు పంచ కట్టుకుని వచ్చారు. అనంతరం మంచి పెర్ఫామెన్స్ ఇచ్చి ఆ తర్వాత మోనాల్ ని జడ్జి సీటు నుంచి స్టేజ్ మీదకి తీసుకు వెళ్లి గులాబీ పువ్వు ఇచ్చి మోకాళ్లపై కూర్చుని చేతిపై కిస్ ఇచ్చాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు.