.ఆ రీజన్ వల్లే నేను పెళ్లి చేసుకోలేదు అంటున్న కోవై సరళ..?
సినీ ఇండస్ట్రీలో తెలుగు, తమిళ భాషల్లో ఫీమేల్ కమెడియన్ గా మంచి గుర్తింపు సాధించుకున్న నటి కోవై సరళ. తన 58వ పుట్టినరోజు జరుపుకున్న కోవై సరళ, తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ లో జన్మించారు. ఎంజీఆర్ సినిమాలను చూసి సినిమాలో నటించాలని భావించిన కోవై సరళ, చిన్న వయసులోనే తమిళ సినిమాలలో నటిగా తన సినీ కెరియర్ ని మొదలు పెట్టింది. ఇలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్నాళ్లకే వయసుకు మించిన పాత్రలలో సైతం నటించి, కోవై సరళ తన నటనతో మెప్పించారు. ఇక ఆమె నటనతో, సమయానికి తగ్గ కామెడీని డెలివరీ చేయడంలో తనకి ఎవరు సాటి లేరు అని నిరూపించుకుంది కోవై సరళ. సినీ ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..
అంతేకాకుండా టాలీవుడ్ లో కోవై సరళ, బ్రహ్మానందం జోడి కి ప్రేక్షకుల ఆదరణ ఎంతగా ఉంటుందో మనకు తెలిసిందే. ఉత్తమ హాస్యనటి పురస్కారాలను కోవై సరళ మూడుసార్లు అందుకోవడం విశేషం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్తమ నటిగా కోవై సరళ నంది అవార్డు అందుకొంది. తన తండ్రి సహకారంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కోవైసరళ పెళ్లి చేసుకోలేదు. కోవై సరళ ప్రస్తుతం తమిళం లోని పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
కోవై సరళ తన ఇంట్లో పెద్ద కూతురు మాత్రమే కాదు తనకు నలుగురు చెల్లెలు కూడా ఉన్నారట. తన చెల్లెళ్లకు విద్య ,వివాహాలకు ప్రాధాన్యత ఇచ్చి, అందువల్లే కోవై సరళ పెళ్లికి దూరంగా ఉన్నారని సమాచారం. కోవై సరళ ఒంటరి జీవితాన్ని ఇష్టపడతారని తెలుస్తోంది. కోవై సరళ అన్ని భాషల్లో ఏకంగా 750 సినిమాలలో నటించింది. ప్రస్తుతం కామెడీల "కలవ కుత్తు ఎప్పాడీ"అనే సోకు కోవై సరళ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తమిళంలోని విజయ్ టీవీ ఛానల్ లో ఈ కామెడీ షో ప్రసారం అవుతోంది. అయితే కోవై సరళ మనకు ఆనందాన్ని పంచుతూనే, తన వివాహ జీవితానికి మాత్రం దూరంగా ఉంటూ వస్తోంది. ఒక కుటుంబంలోని వారందరి కోసం తను ఇంత పెద్ద త్యాగం