భారతదేశ చలనచిత్ర రంగంలో నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తున్న టాలీవుడ్..?
అయితే టాలీవుడ్ చిత్రాలను ఆదరించే అభిమానులు ఇతర భాషా ఫిలిం ఇండస్ట్రీ అభిమానులతో పోల్చితే చాలా ఎక్కువమంది ఉన్నారని చెప్పడానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రెండ్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఫ్యాన్స్ తమ ఫేవరేట్ హీరోలకు సంబంధించి ట్రెండ్ చేసే హ్యాష్ టాగ్స్ భారత దేశంలోనే టాప్ 5 లో నిలుస్తున్నాయి. #HappyBirthdayAlluArjun అనే ట్యాగ్ మొదటి ప్లేస్ లో ఉండగా.. అఖిల్ అక్కినేని 5వ మూవీ #Agent టైటిల్ రెండో ప్లేస్ లో నిలుస్తోంది. #VakeelSaabFromTomorrow హ్యాష్ ట్యాగ్ 4వ నిలుస్తుండగా.. #HBDAkhilAkkineni హ్యాష్ ట్యాగ్ 5వ స్థానం లో నిలుస్తుంది.
ఈ నంబర్స్ ని బట్టి చూస్తుంటే టాలీవుడ్ ఫ్యాన్స్ ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ని డామినేట్ చేస్తున్నారని స్పష్టమవుతోంది. కేవలం ఈరోజు మాత్రమే కాదు ఎన్నో సందర్భాలలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన హ్యాష్ టాగ్స్ ఇండియా టాప్ ట్రెండ్స్ లో మొదటి స్థానంలో నిలిచాయి. వినోద రంగంలో టాలీవుడ్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన హాష్ టాగ్స్ రికార్డ్స్ ఇప్పటికీ చెక్కుచెదరలేదు అంటే అతిశయోక్తి కాదు. నటీనటులు, టెక్నీషియన్లు ఏడాది పొడుగునా కష్టపడుతూ మంచి సినిమాలను ప్రేక్షకులు అందించడానికి బాగా కృషి చేస్తుండగా.. వారిని ఎల్లవేళలా అభిమానులు సపోర్ట్ చేయడం నిజంగా అభినందనీయం.