బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

Suma Kallamadi
అప్పట్లో వచ్చిన ఆదిత్య 369 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలకృష్ణ కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.ఈ సినిమా ఒక  సైన్స్ ఫిక్షన్ స్టోరీ.' ఆదిత్య 369’సినిమాను  ఇప్పటికి మళ్లీ మళ్లీ చూసే వీరాభిమానులు ఉన్నారు. టైమ్ మిషన్ కథాంశంగా 1991లో తెలుగులో తెరకెక్కిన తొలి సైన్స్ ఫిక్షన్ మూవీగా ఆదిత్య 369 రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా రిలీజైన రెండు దశాబ్దాల తర్వాత సింగీతం సీక్వెల తీయాలని ప్లాన్ చేసారు .కానీ ఎందుకో ముందుకు వెళ్లలేదు. అయితే తన బాబాయ్ చేసిన ‘ ఆదిత్య 369’ లాంటి సినిమానే చేయాలని కళ్యాణ్ రామ్ కు ఎప్పటినుంచో ఒక కోరిక ఉందట .


అందుకోసం చాలా కాలంగా కథలు వింటూ వస్తున్నారు. ఆ మధ్యన ఒక కథను విన్నారట.వేణు మల్లిడి అనే కొత్త డైరక్టర్ చెప్పిన కథ ఇలాంటి పాయింట్ చుట్టూనే తిరుగుతుందిట. ఆ కథ కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చింది. ఈ సినిమా టైమ్ మిషన్ నేపథ్యంలో ఉండటంతో కొద్ది పాటి మార్పులు చేర్పులు చేసి వెంటనే ఓకే చేసాడట. ఇప్పుడున్న పరిస్దితులు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమా చేస్తారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.


ఆ కథ ప్రకారం ప్రస్తుతం కాలానికి 500 సంవత్సరాలు వెనక్కి వెళతారని తెలుస్తుంది. అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించడానికి భారీ సెట్స్ కూడా వేయాలని ఫిక్స్ అయ్యి..డిజైన్స్ రెడీ చేయిస్తున్నారట. సినిమా కథ ప్రకారం గత కాలానికి వెళ్లి అక్కడో సమస్యలో పడి, దాన్ని పరిష్కరించుకుని బయిటపడటమే అంటున్నారు.అయితే టైమ్ మిషన్ కాన్సెప్టు ని మాత్రం యాజటీజ్ వాడటరట. ఇప్పటిదాకా వరుస  ప్లాఫ్ సినిమాలతో డీలా పడిన కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా ఒక కీలకం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: