వకీల్‌సాబ్ సినిమా గురించి ఆలియాభట్ ఏం చెప్పారంటే..?
అయితే తాజాగా బాలీవుడ్ నటి ఆలియా భట్ వకీల్ సాబ్ సినిమాపై స్పందించారు. అయితే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు తమ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ టీంకు ఆల్ ది బెస్ట్.. ఫ్యాన్స్ బీ రెడీ ఫర్ వకీల్ సాబ్’’ అని విష్ చేసింది.
కాగా, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఆలియాభట్ సీత పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొమురం భీం, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్-అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆలియాభట్‌తోపాటు హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ హీరోయిన్గా నటిస్తున్నారు. వీరితోపాటు శ్రీయ, అజయ్ దేవ్‌గణ్, సుముద్రఖనీ, పలువురు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల ఆలియాభట్ సీత పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.