వ‌కీల్‌సాబ్ హైద‌రాబాద్‌లో రికార్డు షోలు

VUYYURU SUBHASH
ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ విడుదలకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో థియేటర్లు కేటాయించారు. సోలో రిలీజ్ గా వ‌స్తుండ‌డంతో ఈ సినిమాపై తిరుగులేని అంచ‌నాలు ఉన్నాయి. ఇక థియేట‌ర్ల‌లో ఉన్న సినిమా లేవీ పెద్ద‌గా ఆడ‌క‌పోవ‌డంతో వ‌కీల్‌సాబ్‌కు థియేట‌ర్ల విష‌యంలో పెద్ద‌గా అడ్డంకులు లేవు. ఇక రేపు ఉద‌యం 5 గంట‌ల నుంచే భారీ ఎత్తున షోలు వేయ‌నున్నారు.

ఇక ప్రస్తుతానికి అందిన లెక్కల ప్రకారం.. ఒక్క హైదరాబాద్ లోనే రేపు 800 షోలు వేయబోతున్నారు. నైజాంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హీరోకు ద‌క్క‌ని విధంగా స్క్రీన్లు కేటాయించారు. ఓ వైపు క‌రోనా భ‌యం ఉన్నా కూడా ప్రేక్ష‌కులు లెక్క చేయ‌కుండా ఉద‌యం నుంచే సినిమా చూసేందుకు రెడీ అవుతున్నారు. ఇక అధికారులు సైతం క‌రోనా భ‌యం ఉన్నా కూడా స్పెష‌ల్ షోల‌కు అనుమ‌తులు ఇచ్చారు. ఏపీ,నైజాంలో రేపు ఉదయం 4.30 నుంచే వకీల్ సాబ్ షోలు పడబోతున్నాయి.

ఇక ఓవ‌ర్సీస్ లో కూడా వకీల్ సాబ్ హవా నడుస్తోంది. ఏకంగా 285కు పైగా స్క్రీన్స్ లో వకీల్ సాబ్ స్పెష‌ల్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2018 లో అజ్ఞాత‌వాసి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఆ యేడాది సంక్రాంతికి వ‌చ్చిన ఈ సినిమా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకోలేదు. మ‌రి మూడేళ్ల త‌ర్వాత వ‌స్తోన్న ఈ రీమేక్ మూవీతో అయినా ప‌వ‌న్ హిట్ కొడ‌తాడేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: