వకీల్ సాబ్ ధియేటర్ లో దిల్ రాజ్ మాస్ లుక్ !

Seetha Sailaja
కొన్ని క్షణాల క్రితం హైదరాబాద్ లోని కొన్ని ధియేటర్స్ లో ‘వకీల్ సాబ్’ మొదటి షో ప్రారంభం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు భాగ్యనగరంలోని శివ పార్వతి ధియేటర్ లో ఈమూవీ మొదటిరోజు మొదటి షోను దిల్ రాజ్ తన భార్యతో కలిసివచ్చి చూడటమే కాకుండా పవన్ అభిమానులతో కలిసి చేసిన సందడికి సంబంధించిన వార్తలు హైలెట్ గా మారుతున్నాయి.


ఈమూవీలో వచ్చే సీన్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వగానే పవన్ అభిమానుల ఆనందానికి అంతులేదు. మూడు సంవత్సరాల గ్యాప్ తరువాత తమ పవర్ స్టార్ ను మరింత పవర్ ఫుల్ గా సిల్వర్ స్క్రీన్ పై చూసుకునే సరికి పవన్ అభిమానులు ఆనందంతో రెచ్చిపోయి కాగితం ముక్కలను పువ్వులుగా భావించి పవన్ ను అభిమానిస్తూ  సిల్వర్ స్క్రీన్ పై విసిరారు.


దీనితో మరింత రెచ్చిపోయిన దిల్ రాజ్ అభిమానుల ఆనందానికి తనవంతు సహాయం చేస్తూ ఒక బస్తాలో ఉన్న పేపర్ ముక్కలను గుప్పెళ్ళతో తీసుకుని పవన్ ఎంట్రీ సీన్ ను తాను కూడ ఎంజాయ్ చేస్తూ ఆ పేపర్ ముక్కలను విసురుతూ ఎంజాయ్ చేసిన సందర్భానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ను విపరీతంగా అభిమానించే దిల్ రాజ్ తిరిగి అతడితోనే సినిమాను నిర్మించడం యాధృశ్చికం అనుకోవాలి.


ఈరోజు భాగ్యనగరంలో 90 శాతం ధియేటర్లలో ‘వకీల్ సాబ్’ ప్రదర్శింప బడటంతో ఈమూవీ ఓపెనింగ్ రికార్డ్స్ పై అనేక అంచనాలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీ ఫస్ట్ డే కలక్షన్స్ ‘బాహుబలి 2’ రికార్డులను దాటినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. మరికొన్ని గంటలలో బయటకు వచ్చే ఈ మూవీ ఫస్ట్ టాక్ గురించి ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ మూవీ ఫలితం బట్టి టాప్ హీరోల సమ్మర్ రేస్ మూవీల రిలీజ్ డేట్స్  ఒక కొలిక్కి వస్తాయి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: