వకీల్ సాబ్ లో పవన్ రాజకీయ జీవితాన్ని ఉద్దేశించి చెప్పిన డైలాగులు ఇవే....

Purushottham Vinay
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకున్నాడు.ఒక పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో పక్క వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.ఇక పవర్ స్టార్ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో దాదాపు మూడు సంవత్సరాల తరువాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అనన్య నాగళ్ల, అంజలి, నివేదా థామస్ ముఖ్య పాత్రలు పోషించగా, శృతి హాసన్ కథానాయికగా నటించింది. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.కరోనా వలన పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయిన పవర్ స్టార్ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

ఇక సినిమా విడుదల అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది..ఇక ఈ సినిమాలో ఈ డైలాగులు ప‌వ‌న్ రాజ‌కీయ జీవితాన్ని ఉద్దేశించి చెప్పిన‌వే.. ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

1.."మీరు దూరమై జనాలు జీవితాలనే పొగొట్టుకుంటున్నారు" అని అంజలి పవన్ తో అనే లైన్...

2.."వాళ్లు నాతో ఉన్నా లేకపోయినా నేను వాళ్లతోనే ఉంటాను" అనే పవన్ కల్యాణ్ డైలాగ్...

3.."ఇప్పుడు జనానికి నువ్వు కావాలి.." అని శరత్ బాబు చివర్లో పవన్ తో అనడం..


ఇక ఈ మూడు డైలాగ్స్ ఫ్యాన్స్ ని థియేటర్ లో ఈలలు విసిరేలా చేశాయి. గతంలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో అభిమానులు ఈ సినిమాని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.సమాజానికి కావల్సిన సందేశం, ఫ్యాన్స్ కి కావల్సిన మసాలా కలిసిన ఈ వకీల్ సాబ్ వసూల్ సాబ్ అయ్యే చాన్స్ లేకపోలేదు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: