సూపర్ స్టార్ ట్వీట్ కి తెగ ఫిదా అయిపోతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్......
ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ సినిమా చూసి పవన్ కళ్యాణ్.. పవర్ ప్యాక్‌డ్ పర్ఫామెన్స్ అంటూ మెచ్చుకుంటున్నారు.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ..'వకీల్ సాబ్' మూవీ చూసి పవన్ కళ్యాణ్ నటనతో పాటు ప్రకాష్ రాజ్ యాక్టింగ్‌ను మెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత అసలు సిసలైన కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన 'వకీల్ సాబ్' అందరు చూడాల్సిన సినిమా అంటూ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్‌తో పాటు ఈ సినిమాలో నటించిన అంజలి, నివేదా, అనన్య నాగళ్ల నటనను సూపర్ స్టార్ మహేష్ బాబు కొనియాడారు.
ఇక వేరే హీరో ట్వీట్ చేసిన పట్టించుకునేవారు కాదు గాని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చెయ్యడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మహేష్ కి థాంక్స్ చెప్తూ మహేష్, పవన్ దిగిన ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు. ఎలా అయినా పవర్ స్టార్ తో కలిసి ఒక మూవీ చెయ్యండి అని పవర్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ స్టార్ ని కోరుతున్నారు.నిజం చెప్పాలంటే టాలీవుడ్ లో మహేష్ కి పవన్ కి ఎప్పట్నుంచో పోటీ వుంది. ఇద్దరూ పెద్ద స్టార్స్ కావడంతో ఫ్యాన్ వార్స్ అనేవి జరగడం కామన్. కాని మహేష్ ఎలాంటి ఈగో లేకుండా పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చెయ్యడం ఆయన మంచి తనానికి నిదర్శనం అని చెప్పాలి. పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా మా బాబు బంగారం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు..