ఈ స్టార్ విలన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....

Purushottham Vinay
ఒక సినిమాలో హీరో హైలైట్ అవ్వాలంటే ఖచ్చితంగా అతనికి పోటీగా విలన్ ఉండాలి.ఒక కమర్షియల్ సినిమా బాగా పండాలంటే ఖచ్చితంగా పవర్ ఫుల్ విలన్ ఉండాలి. విలన్ లేకపోతే ఆ సినిమాలో అంత పవర్ ఉండదు. ఇంకా ఒక్కోసారి హీరోల కంటే విలన్ లు కూడా బాగా ఫేమస్ అవుతారు. వారెవరో వాళ్ళ రెమ్యూనరేషన్ ఎంతో చూడండి...

ముందుగా చెప్పుకోవాల్సింది ప్రకాష్ రాజ్ గురించి.. ఆయన ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో ఒదిగిపోయే ఏకైక నటుడు.. తన నటనతో ఆ పాత్రకు జీవం పోస్తాడు. కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన అంతపురం సినిమాలో త‌న న‌ట‌న‌తో ప్ర‌కాష్ రాజ్ విల‌న్ గా ఒక్క‌సారిగా హైలెట్ అయ్యాడు. అప్ప‌టి నుంచి విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కొన‌సాగుతున్నాడు. ఆయన విలన్‌ పాత్రకు అయితే దాదాపు కోటిన్నర వరకు తీసుకుంటారని సమాచారం. అదే సపోర్టింగ్‌ క్యారెక్టర్‌కు అయితే దాదాపు 10 లక్షల రూపాయలను రెమ్యునరేషన్‌గా పుచ్చుకుంటాడట.
నటసింహం బాలయ్య ‘లెజెండ్’ సినిమాతో విలన్‌గా జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఇక అప్పటి నుంచి జగపతిబాబుకు వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన దక్షిణాదిలోనే ది బెస్ట్ విలన్‌గా కొనసాగుతున్నారు. ఈయన ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్న సాయికుమార్‌..రామ్‌చరణ్‌ ‘ఎవడు’సినిమాతో విలన్‌గా మారాడు. ఆ సినిమాలో సాయికుమార్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం సాయికుమార్‌ ఒక్కో సినిమాకు రూ.50లక్షలు తీసుకుంటున్నాడట.

ఇక రియల్ హీరో సోనూ సూద్ అరుంధతి సినిమాతో టాలీవుడ్‌లో టాప్‌ విలన్‌ లిస్ట్‌లో చేరాడు. విలన్‌గా భయపెడుతూనే అప్పుడప్పుడు నవ్విస్తాడు కూడా. ఈ యంగ్‌ విలన్‌ ఒక్కో సినిమాకు రూ.80లక్షల నుంచి కోటి వరకు పుచ్చుకుంటాడట.
రాజమౌళి ‘ఈగ’సినిమాతో విలన్‌గా మారాడు కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌. ఈ సినిమాతో టాలీవుడ్‌లో సుదీప్‌కు మంచి మార్కెట్‌ ఏర్పడింది. ఆయన నటించిన కన్నడ సినిమాలు కూడా ఇక్కడ విడుదలయ్యాయి. అలాగే దబాంగ్‌-3లో కూడా విలన్‌గా నటించాడు. ఈ స్టైలీష్‌ విలన్‌ ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు తీసుకంటాడని టాక్‌.
ప్రభాస్ మిర్చి చిత్రంలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు సంపత్ రాజ్. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాల్లోలో విలన్‌గా నటిస్తూ దూసుకెళ్తున్నాడు. ఈయన ఒక్కో సినిమాకు రూ.60లక్షల నుంచి 70లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం.
బన్నీ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమాతో విల‌న్ గా ఎంట్రీ ఇచ్చాడు ర‌వి కిష‌న్. తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా’లో కూడా మంచి పాత్ర లభించింది. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు 50 లక్షలు తీసుకుంటాడని సమాచారం. వీరితో పాటు ఒకవైపు హీరోగా రాణిస్తూనే విలన్‌ రోల్స్‌ చేస్తున్న ఆది పినిశెట్టి రూ.కోటి, కోలీవుడ్‌ సినిమాల్లో విలన్‌గా రాణిస్తున్న హరీష్‌ రూ.50లక్షలుగా రెమ్యునరేషన్‌ అందుకుంటున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: