శ్రీదేవి డ్రామా కంపెనీ.. అందరు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారుగా..?

praveen
ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు రోజురోజుకు క్రేజ్ పెరిగిపోతున్న నేపథ్యంలో అటు ఈటీవీ లో ఎన్నో వినూత్న మైన బుల్లితెర కార్యక్రమాలు రోజురోజుకు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ టీవీ లో ఎన్నో షోలు ఆటో ప్రేక్షకులందరికీ ఎంటర్ టైన్మెంట్ పంచుతూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ అనే సరికొత్త కార్యక్రమం ప్రారంభమైంది . ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ పంచేందుకు నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఎపిసోడ్ కొత్తగా ప్లాన్ చేస్తున్నారు.  వివిధ రకాల టాలెంట్ ఉన్న వ్యక్తులతో శ్రీదేవి డ్రామా కంపెనీ లో పర్ఫామెన్స్ చేయిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే ఇటీవల విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఇక ఇప్పుడు ప్రోమోలో భాగంగా ఇక మరో సారి జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా తమదైన శైలిలో కామెడీ పండించారు.  ప్రోమో చూస్తుంటే మరోసారి ఈ వారం కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పక్క అన్నది అర్ధమవుతుంది బుల్లితెర ప్రేక్షకులకు. ఇకపోతే ఇటీవల విడుదలైన ప్రోమో లో భాగంగా  షో లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంట నీరు పెట్టుకున్నారు. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు ఈ షో చూస్తున్న నేటిజన్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.



 శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో లో భాగంగా సింగర్ మధుప్రియ ఎంట్రీ ఇచ్చి ఒక పాట పాడుతుంది. ఎందాకే ఎందాకే అంటూ ఒక లవ్ సాంగ్ పాడి అందరినీ అలరించిన మధు ప్రియ ఇక ఆ తర్వాత  ఒక తల్లి కోసం ఆరాటపడే కొడుకు బాధను తెలుపుతూ యాడున్నావో ఓ అమ్మ నీ కోసం తల్లడిల్లి పోతున్న అంటూ దీనమైన గొంతుతో పాడిన పాట అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.  ఇంకా మధు ప్రియ పాట పాడిన తర్వాత ఇక ఈ షోకి గెస్ట్ గా వచ్చిన పృథ్విరాజ్ తన తల్లి తన చేతుల్లోకి చని పోయింది అంటూ ఎమోషనల్  అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటారు..  ఇక ఆ తర్వాత మధుప్రియ తల్లి కోసం పాటపాడిన కూడా ఇప్పటికీ తనకు మాత్రం తన తండ్రి గుర్తుకు వస్తున్నాడు అంటూ కంటతడి పెట్టుకుంటుంది వర్ష. ఇలా   మధు ప్రియ పాట అందరిని కంటతడి పెట్టించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: