లీడ్ రోల్ లో కమెడియన్ సత్య... ఆహా అనిపిస్తాడా...?
అంతేకాదు ఒక నటుడు ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగలడు అన్న విషయాన్ని తెలియజేశారు. సునీల్, సప్తగిరి, షకలక శంకర్..ఇలా ఎంతో మంది కమెడియన్లు హీరోలుగా ఛాన్సులు అందుకొని తమ టాలెంట్ నిరూపించుకున్నారు. ఇప్పుడు మరో కమెడియన్ లీడ్ రోల్ కు ఎంపికయ్యారు. అంటే హీరో రేంజ్ లో అని చెప్పలేం కానీ...లీడ్ రోలే. ఇంతకీ అతనెవరంటే...టాలీవుడ్ లో టాలెంటెడ్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సత్య... తన కామిక్ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి వారి అభిమానాన్ని అందుకున్నాడు. అయితే తాజా సమాచారం ఒరకరం సత్య ఓ వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సిరీస్ లో సత్య లీడ్ రోల్ లో కనిపించనున్నట్టు టాక్ నడుస్తోంది.
తెలుగులో మనకు ఉన్న ఏకైక ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’.. ఈ వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నట్టు సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మరి ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుందన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక సక్సెస్ అయితే సత్యకు వెండి తెరపై కూడా హీరో గా అవకాశాలు దక్కే చాన్స్ లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. తన పంచ్ డైలాగ్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కమెడియన్ హీరో గా చాన్స్ కొట్టేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.