ఎన్టీఆర్ - కొరటాల మూవీ బ్యాక్ డ్రాప్ అదే .... ఫ్యాన్స్ రచ్చ రచ్చే .... ??

GVK Writings
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరో లుగా ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ సినిమా ఆర్ఆర్ఆర్ పై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. డివివి దానయ్య దాదాపుగా రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ తో తీస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది. చరణ్ ఇందులో అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తున్నారు. ఎంతో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమా పరిశ్రమలకు చెందిన పలువురు నటులు కీలక పాత్ర లు చేస్తున్నారు.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అలానే విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు. అయితే దీని తరువాత ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలపై త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయాల్సి ఉంది, వాస్తవానికి ఈ మూవీ యొక్క ప్రకటన ఇటీవల వచ్చింది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆ ప్రాజక్ట్ ప్లేస్ లో కొరటాల శివ తో ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటన వచ్చింది. కారణాలు ఏమైనప్పటికీ త్రివిక్రమ్ ప్లేస్ లో కొరటాల రావడం మంచిదే అని, ఆయన మాదిరిగా ఈయన కూడా ఎంతో అద్భుతంగా తమ హీరోని స్క్రీన్ పై చూపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

అసలు విషయం ఏమిటంటే, పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా తాజా రాజకీయాల నేపథ్యంలో సాగుతుందని, అంతేకాక సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు శివ ఎంతో అద్భుతంగా పక్కా కమర్షియల్ జానర్ లో తీయనున్నారని చెప్తున్నారు. మరి ఇదే కనుక నిజం అయితే జనతా గ్యారేజ్ మాదిరిగా మరొక్కసారి కొరటాల, ఎన్టీఆర్ ల కలయికలో మరొక బ్లాక్ బస్టర్ ఖాయం అనే చెప్పాలి.... !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: