రామ్ రికార్డుని బీట్ చేసిన నవీన్ విజయ్ రికార్డుని బీట్ చెయ్యలేకపోయాడు...

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రీసెంట్ గా 'జాతి రత్నాలు' సినిమాతో పెద్ద హిట్ కొట్టి టాలీవుడ్ లో బాగా ట్రెండ్ అయ్యాడు. ఇక ఈ సినిమా ఆరంభం నుంచే మంచి స్పందనతో వసూళ్లను రాబట్టి దూసుకెళ్లింది. ఇక ఈ సినిమా నైజాంలో రూ. 16 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.97 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.92 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.52 కోట్లు, గుంటూరులో రూ. 2.08 కోట్లు, కృష్ణాలో రూ. 1.85 కోట్లు, నెల్లూరులో రూ. 91 లక్షలతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 32.52 కోట్లు షేర్, రూ. 52.25 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ఇక ఫుల్ రన్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.52 కోట్లు షేర్ వసూలు చేసిన 'జాతి రత్నాలు'.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.72 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.28 కోట్లు రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.52 కోట్లు షేర్‌తో పాటు రూ. 64.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఫలితంగా ఎన్నో మైలురాళ్లను చేరుతూ ఊహించని రీతిలో రికార్డులను బద్దలు కొట్టేసింది.


తెలుగులో ఎక్కువ లాభాలను అందుకున్న మీడియం చిత్రాల జాబితాలో రూ. 27.02 కోట్లతో 'జాతి రత్నాలు' నాలుగో స్థానంలో నిలిచింది. అయితే దీని కంటే ముందు 'గీత గోవిందం' రూ. 55.43 కోట్లతో మొదటి స్థానంలో, 'ఉప్పెన' రూ. 31.02 కోట్లతో రెండో స్థానంలో, 'ఫిదా' రూ. 30.50 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. 'ఇస్మార్ట్ శంకర్' రూ. 22.78 కోట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.ఇక రామ్  రికార్డుని అవలీలగా కొట్టిన నవీన్ విజయ్ రికార్డుకి చాలా దూరంలో వుండిపోయాడు. ఇక భవిష్యత్తులోనైనా విజయ్ రికార్డుని కొడతాడో లేడో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: