వకీల్ సాబ్ లాంటి సినిమా మళ్లీ పవన్ నుండి వస్తుందా...?

VAMSI
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు అస్సలు ఉండరు. ఎందుకంటే కోట్లమంది ప్రజలకు పవన్ అంటే ఆరాధ్య దైవం. ఆయన సినిమా వస్తే...థియేటర్స్ దగ్గర టిక్కెట్ల కోసం క్యూ కడతారు. సినిమా ఎలా ఉన్నా అభిమానంతో దానిని సూపర్ హిట్ చేస్తారు. 3 సంవత్సరాల క్రితం వరకు ఏడాదికి కనీసం ఒక్క పవన్ కళ్యాణ్ మూవీ అయినా రిలీజ్ అయ్యేది. కానీ పవన్ కళ్యాణ్ హఠాత్తుగా సినీ జీవితం నుండి రాజకీయాల వైపు యు టర్న్ తీసుకోవడంతో కథంతా మారిపోయింది. దాని తరువాత రాజకీయాలతో బిజీ గా మారిపోయారు. అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. 


ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఈ సినిమా విడుదలయ్యి వరం రోజులు దగ్గర పడుతున్నా ఇప్పటికీ కలెక్షన్ లు నిలకడగానే ఉన్నాయి. పవన్ సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులకు ఈ సినిమా ఆకలి తీర్చిందని చెప్పవచ్చు. హిందీలో అమితాబ్ చేసిన పింక్ కి రీమేక్ గా వచ్చింది. అమితాబ్ బచ్చన్ కి ఏ మాత్రం తగ్గకుండా ఏ సినిమాలో పవన్ నటన ఉంది. దీనితో ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మహిళలపై తీసుకున్న పాయింట్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుత సమాజంలో ఆడవారిపై జరుగుతున్న దురాగతాలను అడ్డుకునే విధంగా ఈ సినిమాని తెరకెక్కించడంతో డైరెక్టర్ శ్రీరామ్ వేణు పై ప్రశంసల జల్లు కురుస్తూ ఉంది. 


అభిమానులు అయితే ఇకపై ఏడాదికి ఒక సినిమా చేయాలని ఆశిస్తున్నారు. ఎంతోమంది అక్కాచెలెళ్ళు ఇటువంటి విలువలు సమాజానికి ఉపయోగపడే సినిమాలను తీయాలని పవన్ ను కోరుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇటువంటి సినిమాలు తీసినప్పుడే ప్రజలకు మరింత దగ్గరవుతారన్న దానికి ఒక ఉదాహరణగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు సైతం ఈ సినిమాపై అభినందనలు తెలియచేస్తున్నారు. మరి వకీల్ సాబ్ లాంటి సందేశాత్మక సినిమాలలో మళ్ళీ పవన్ కళ్యాణ్ నటిస్తాడా..లేదా కమర్షియల్ సినిమాల వైపే మొగ్గు చూపుతాడా భవిష్యత్తులో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: