బడా హీరోల సినిమాల విషయంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో ఉండాల్సింది కానీ అది కాస్తా మహేష్ బాబు తో ఫిక్స్ అయ్యింది. కొరటాల నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో ఉండాల్సింది కానీ ఇప్పుడు మహేష్ తో సెట్ అయింది. అయితే ఇప్పుడు. మహేష్..ఎన్టీఆర్ ల తదుపరి చిత్రాలపై మాత్రం క్లారిటీ రాగా మధ్యలో అల్లు అర్జున్ నెక్స్ట్ పై క్లారిటీ లేకుండా పోయింది. ఇక ఎన్టీఆర్ తో కొరటాల సినిమా అనగానే బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహానికి లోనయ్యారు. మా హీరోతో సినిమా ఉంటుందా లేదా..ఉంటే ఎప్పుడు ఉంటుంది అని చిత్ర నిర్మాణ సంస్థ యువసుధ ను ఏకేశారు. దాంతో అభిమానుల ఆగ్రహం చూసి యువసుధ అర్జెంట్ గా ఒక ట్వీట్ చేసింది. అల్లు అర్జున్ కొరటాల సినిమా ఉంటుందని..జిఏ 2 నిర్మాణ సంస్థ తో మ్యూచువల్ అండర్ స్టాండింగ్ ప్రకారమే ఇది జరిగిందని పేర్కొంది. అంతే కాకుండా ఈ సినిమా ఎప్రిల్ 2022 తరవాత ఉంటుందని ట్వీట్ లో పేర్కొంది.
నిర్మాణ సంస్థ అయితే వెల్లడించింది కానీ అది కేవలం ఫ్యాన్స్ ను కూల్ చేయడానికి మాత్రమే అని తెలుస్తోంది. నిర్మాణ సంస్థ ట్వీట్ చేస్తే కొరటాల దాన్ని అంగీకరిస్తు రీట్వీట్ చేయాలి కానీ కొరటాల అలా చేయలేదు. దాంతోనే అనుమానాలు మొదలయ్యాయి. మరోవైపు బన్నీ కూడా తనను కొరటాల పక్కన పెట్టడం తో గుర్రుగా ఉన్నారట. అంతే కాకుండా తాజాగా వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ తో అనుకున్న ఐకాన్ ను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. అయితే దీనిపై క్లారిటీ రాలేదు. బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యేసరికి తన నెక్స్ట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ముందుగా అనుకున్నట్టు బన్నీ ఐకాన్ మొదలు పెడతారా..? లేదంటే సినిమా ఏదైనా ఉంటుందా చూడాలి.