అడవి శేష్ తో రిలేషన్ ఇదే.. పవన్ ఏమైతే నాకేంటి.. రేణు దేశాయ్ సంచలనం..!!
గత కొన్ని రోజులుగా తన గత జీవితం తాలూకు ప్రభావం తనపై ఏమాత్రం పడకుండా ఇప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే పనిలో పడింది. దర్శకురాలిగానే కాకుండా నటిగానూ నిరూపించుకోడానికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే పలు సినిమాలకు సైన్ చేసింది.. మరోవైపు సీరియల్స్ లో, షోలలో కనిపిస్తుంది.. ఇది చాలదన్నట్లు సినిమాలు కూడా నటించడం మొదలుపెట్టనుంది.. ఈనేపథ్యంలో ఆమె సోమవారం నాడు విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్న మేజర్ టీజర్ పై తన అభిప్రాయాన్ని తెలిపింది..
గతంలో కూడా అడవి శేష్, అకిరా కలిసి ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.ఈనేపథ్యంలో దీన్ని పవన్ ఫ్యాన్స్ ఆమెను సోషల్ మీడియా వేదికలో అడగగా ఆమె ఫైర్ అయ్యింది. అడవి శేష్‌తో ఆద్య, అకిరా రిలేషన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అని నెటిజన్ ప్రశ్నించగా.. ‘రాశాం కదా.. అన్న అని.. అడవి శేష్ అంటే అన్న’ అంటూ క్లారిటీ ఇచ్చింది రేణు దేశాయ్. అయితే అయినప్పటికీ మళ్లీ మళ్లీ మీ రిలేషన్ షిప్ ఏంటి అని?.. అడగడంతో.. ‘మీకు తెలుగు అర్థం కాదా?? బ్రదర్ అంటే ఏంటి?? అన్న.. అనే కదా అర్థం.. మీకు అర్థం కాదా?? అన్న అంటే బిగ్ బ్రదర్’ అని కాస్త గట్టిగానే చెప్పింది రేణు దేశాయ్.