సమంత ఫిట్నెస్ ప్రయోగాలు మాములుగా చేయడం లేదుగా.. !!
అలాగే వాటికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు తాజాగా యోగా ట్రాపేజీ కూడా నేర్చుకుంటుంది సమంతా అక్కినేని. ఈ క్రమంలోనే తలకిందులుగా విన్యాసాలు చేస్తున్న ఓ ఫొటోను అభిమానులతో షేర్ చేసుకుంది సమంత. అలాగే ఆ ఫోటో కింద ఒక కామెంట్ కూడా పోస్ట్ చేసింది. "జీవితమంటేనే పట్టుకోవడం... వదిలిపెట్టడం" అంటూ తన దైన శైలిలో రాసుకొచ్చింది. ప్రస్తుతం సమంత పోస్ట్ చేసిన ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.నెటిజన్లే కాక, సెలెబ్రిటీలు కూడా సమంతా విన్యాసానికి ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు. తల కిందకు కాళ్ళు పైకి పెట్టు తాడుతో సమంత చేసిన విన్యాసానికి అందరు కూడా వారెవ్వా అనకుండా ఉండలేరు.
తలకిందులుగా వేలాడుతూ కాళ్లను మడిచి పట్టుకుని వాటిని చేతులతో పట్టుకోవడం అంటే మాములు విషయం కాదు.. కానీ సమంత ఎంతో చాకిచక్యంగా ఈ విన్యాసాన్ని చేసి చూపించింది. ఏదన్నా సాధించాలంటే పట్టుదల అనేది ఎంతో ముఖ్యమని సమంత ఈ పిక్ ద్వారా చెప్పకనే చెప్పింది. సమంత సినిమాల విషయంలో ఎంత ఆచి తూచి అడుగులు వేస్తుందో తన బాడీ ఫిట్ నెస్ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటుంది. సమంత ఖాళీగా ఉన్న సమయంలో యోగా, మెడిటేషన్ చేస్తూ కాలక్షేపం చేస్తుంది.ప్రస్తుతం సమంతకి సంబందించిన ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది..