వామ్మో..మెగా ప్రిన్సెస్ బాడీ చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే..!!

Mamatha Reddy
మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలొచ్చినా ఎవరి ప్రత్యేకత, ఎవరి స్పెషలిటీ వారికే ఉంది. అలా టాలీవుడ్ కి వచ్చిన మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు వరుణ్ తేజ్.. అతి తక్కువ కాలంలోనే మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుని మెగా ప్రిన్సెస్ బిరుదు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్.. ఇతను స్టార్ మెటీరియల్ అని తెలియడానికి ఎన్నో రోజులు పట్టలేదు.ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్.. ఆ తర్వాత కంచె సినిమాతో ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో వరుణ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
 రెండు మూడు సినిమాలతోనే హిట్ తో పాటే క్రేజీని కూడా సంపాదించుకున్నాడు.. వరుణ్ తేజ్ మొదటి సినిమా నుంచి గమనిస్తే ఒక సినిమా కి, ఒక సినిమా కి పొంతన ఉండదు. కొన్ని ప్రయోగాలు ఫెయిల్ అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మరిన్ని విభిన్నమైన సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ రేట్ తో దూసుకువెళ్తున్నాడు. మొదట్లో ఒకటి రెండు హిట్ సినిమాలు చేసినా లోఫర్ మిస్టర్ సినిమాల తర్వాత సినిమాల ఎంపిక విషయంలో కాస్త ఆలోచించి అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తుంది.అంతరిక్షం, తొలిప్రేమ, f2 ఫిదా, గద్దలకొండ గణేష్ ఇలా అయన గత కొన్ని సినిమాలుగా చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయినవే..
ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న గని సినిమాలో చేస్తున్న వరుణ్ తేజ్ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. గని సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా బరువు పెరుగుతున్నాడట. ఈ సినిమాలో కొన్ని సీన్స్ కోసం వరుణ్ చాలా లావు కనిపించాల్సి ఉందట. అందుకోసం నిజంగానే వరుణ్ చాలా బరువు పెరిగినట్లుగా చెబుతున్నారు. ఈమద్య కాలంలో వరుణ్ ను చూస్తే బాహుబలి రేంజ్ లో ఉన్నాడు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారట.ఈ సినిమా కు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. సిద్దుతో కలిసి ఈ సినిమా ను అల్లు బాబీ నిర్మిస్తున్నాడు. పూర్తి స్థాయి సినిమా నిర్మాతగా అల్లు బాబీ మారడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: