డ్రగ్స్ ఊబిలో పాప్ స్టార్...పల్స్ చెక్ చేసేంత ధీనస్థితి...?

VAMSI
మాములుగా ఒక సాధారణ మనిషి ఒక సెలబ్రిటీ స్థాయికి వెళ్లాడంటే, వారి జీవవనశైలి పూర్తిగా మారిపోతుంధి. అంతకు ముందు లేని అలవాట్లకు అలవాటుపడిపోతారు. ఆల్కహాల్, సిగరెట్, పబ్స్ కి వెళ్లడం మరియు డ్రగ్స్ తీసుకోవడం. వీటన్నింటిలో అత్యంత ప్రమాదకరమైనది డ్రగ్స్ కు బానిస కావడం. ఇలా డ్రగ్స్ కు అలవాటు పడి ఎంతోమంది సెలబ్రిటీలు వారి కెరీర్ ను, జీవితాన్ని చివరకు ప్రాణాలను సైతం కోల్పోయిన సంఘటనలు ఎన్నో చూశాము. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఒక యంగ్ పాప్ స్టార్ కథ ఇదే విధంగా తయారయింది. అతనెవరో కాదు యువకుల మనసులో తన పాటలతో చెరగని ముద్రవేసిన ప్రముఖ పాప్ స్టార్ మరియు మోడల్ జస్టిన్ బీబర్.

ఇతను కూడా మొదట్లో బాగానే ఉన్నాడు. ఎంతో కష్టపడి ఒక పాప్ సింగర్ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు స్వయంగా జస్టిన్ బీబర్ తన దీన స్థితి గురించి చెప్పుకోవడం తీవ్ర బాధాకరం. ఇతను మాదకద్రవ్యాలకు అలవాటుపడి..చివరకు బతికి ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి ప్రతి రోజూ రాత్రి ఇతని బాడీ గార్డ్స్ తన బెడ్ రూమ్ కి వచ్చి పల్స్ చెక్ చేస్తున్నారట.  ఇతను ప్రపంచంలోనే ప్రముఖ పాప్ స్టార్ లలో ఒకరు. ఇతను ఎలా డ్రగ్స్ కి బానిసయ్యాడో ఇతనే వెల్లడించడంతో ఇది కాస్తా వైరల్ అవుతోంది. బీబర్ అతి చిన్న వయసులోనే పాప్ స్టార్ కావడానికి ఎన్నో పోరాటాలు చేసినట్లుగా తెలిపాడు. నా ఈ డ్రగ్స్ కు ముఖ్య కారణం..జీవితంలో నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరెన్నో బాధలు ఉన్నాయి. అంతే కాకుండా ఇతనికి మోనో.. లైమ్ అనే వ్యాధులు ఉన్నాయి. వీటి వలన చాలా బాధపడుతున్నాను. నాకున్న ఈ సమస్యలను ఎవ్వరూ పరిష్కరించలేరు.

నాకు దక్కిన ప్రతి విజయం నాకు మంచి చేస్తుందని భావించాను. ఈ బాధలన్నిటికన్నా నేను తీసుకునే డ్రగ్స్ పెద్ద ఇబ్బంది అనిపించలేదు. అందుకే నేను ఇంతలా డ్రగ్స్ కి అలవాటుపడిపోయాను. ఇతను మూడు సంవత్సరాల క్రితం అమెరికన్ మీడియా పర్సన్ అయిన హేలీ బాల్డ్విన్ ను పెళ్లి చేసుకోవడం జరిగింది. జస్టిన్ బీబర్ ఇంతలా మారడంతో ఇతని అభిమానులు ఎంతో కలత చెందుతున్నారు. త్వరగా కోలుకుని మళ్ళీ మాములుగా మారాలని కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: