స్టార్‌ హీరోయిన్‌: అతడు నన్ను మోసం చేశాడు...?

VAMSI
గత సంవత్సరం బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తరువాత...పోలీసుల విచారణలో ఎన్నో కీలక విషయాలు బయటపడిన విషయం తెలిసిందే...ఇందులో డ్రగ్స్ రాకెట్ కి కూడా భాగముందని తెలుసుకున్న ఎన్ ఐ ఎ అధికారులు, ఎంతో మందిని ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వారిలో ఒకరు మన శాండల్ వుడ్ హీరోయిన్ సంజన గల్రాని. ఈమె ఈ కేసులో జైలుకు వెళ్లి మూడు నెలలపాటు ఈ శిక్షను అనుభవించారు. సంజన గల్రాని సోదరి అయిన నిక్కీ గల్రాని పేరు గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఈమె ప్రముఖ వ్యాపార వేత్త పై చీటింగ్ కేసు పెట్టడంతో ఈమె లైమ్ లైట్ లోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని  కోరమంగలలో  కేఫ్ పెట్టడానికి నిక్కీ గల్రాని ని 2016 లో ప్రముఖ వ్యాపార వేత్త నిఖిల్ హెగ్డే కలిశాడట. అయితే ఈమె కూడా అతనిని నమ్మి ఈ కేఫ్ పెట్టడానికి 50 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు చెబుతోంది. కానీ వీరు ఇరువురు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ప్రతి నెల నిక్కీ గల్రానీ కి లక్ష రూపాయల వరకు చెల్లించాలి. కానీ ఇతను ఇప్పటి వరకు  ఒక్క నెల కూడా అనుకున్న విధంగా చెల్లించలేదని తెలిపింది. మరియు విషయం కనుక్కోవడానికి ఫోన్ చేస్తుంటే నా ఫోన్ ను లిఫ్ట్ చేయడం లేదని వాపోయింది.

దీనికి పోలీసులు ఆమె ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి నిఖిల్ హెగ్డే పై చీటింగ్ కేసును నమోదు చేయడం జరిగింది.  ఈ కేసు విషయమై నిఖిల్ హెగ్డే ను విచారణ నిమిత్తం  ట్రయల్స్ కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో పలు సినిమాలలో నటించింది.  కాగా ఈ కేసులో తరువాత ఏ పరిణామాలు జరుగుతాయో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: