వాళ్లంతా ఓవర్ యాక్షన్ చేస్తారు.. అదిరే అభి షాకింగ్ కామెంట్స్..?

praveen
ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ఇక జబర్దస్త్ లో కామెడీ పంచుతూ ప్రేక్షకులందరినీ అలరించే కమెడియన్స్ కి కూడా అంతకు మించి క్రేజు ఉంది. ఒక సాదాసీదా కమెడీయన్గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఇక ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా మారిపోయారు. కేవలం బుల్లితెర ప్రేక్షకులను అలరించడమే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఫేమస్ అయ్యి తర్వాత ఇక వెండి తెరపై కూడా అవకాశాలు దక్కించుకుని సత్తా చాటుతున్నారు ఎంతోమంది. అయితే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం లో కేవలం కమెడియన్స్  మాత్రమే కాదు మల్టీ టాలెంటెడ్ నటులు కూడా ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే జబర్దస్త్ లో ప్రస్తుతం కామెడీ పంచుతున్న మల్టీ టాలెంటెడ్ నటులలో అదిరే అభి  కూడా ఒకరూ. ప్రభాస్ హీరోగా నటించిన ఈశ్వర్ అనే సినిమాలో ప్రభాస్ స్నేహితుడు పాత్రలో నటించిన అదిరే అభి ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు సంపాదించుకోలేక పోయాడు. తర్వాత  చిత్ర పరిశ్రమకు దూరమైన సాఫ్ట్వేర్ జాబ్ వైపు కూడా వెళ్ళాడు. నటుడుగా తన సత్తా చాటాలని ఆశ ను వదులుకోలేక మళ్ళీ జబర్దస్త్ లో ప్రయత్నం చేసి ఇక పూర్తిగా బుల్లితెరకు పరిమితం అయిపోయాడు.ప్రస్తుతం జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు అదిరే అభి.


 అయితే ఇటీవలే ఇంటర్వ్యూకి హాజరైన జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి తన జీవితంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాల గురించి అందరితో పంచుకున్నాడు. కొన్ని కొన్ని సార్లు సినిమా అవకాశాల కోసం ఆఫీస్ లకి వెళ్తే డైరెక్టర్ల మేనేజర్లు ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు అంటూ అది చెప్పుకొచ్చాడు. వాళ్లకు అసలు జబర్దస్త్ అంటే ఏమిటో తెలియనట్టు గా.. చాలా చులకనగా చూస్తారు అంటూ తెలిపాడు. ఎవరు నువ్వు.. జబర్దస్త్ లో కమెడియన్వా నేను ఎప్పుడూ జబర్దస్త్ చూడను అంటూ ఓవరాక్షన్ చేస్తారని ఇక ఆ తర్వాత జబర్దస్త్ లో జడ్జెస్ అలా నిజంగానే నవ్వుతారా అంటూ మళ్ళీ జబర్దస్త్ గురించి అడుగుతూ  ఉంటారూ అంటూ చెప్పుకొచ్చాడు అదిరే అభి. ఇలా వాళ్లకు జబర్దస్త్ గురించి తెలిసినప్పటికీ కావాలనే ఓవరాక్షన్ చేస్తున్నారు అని అర్థం అవుతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: