అంత దమ్ము లేదా.. స్టేజ్ మీదే రఘు మాస్టర్ కి వార్నింగ్ ఇచ్చిన ఓంకార్..?

praveen
బుల్లితెరపై ఏదైనా సరికొత్త షో తెరమీదికి తీసుకు రావాలి అంటే అది యాంకర్ ఓంకార్ తర్వాతే అని చెబుతూ ఉంటారు ఎంతో మంది. ఎందుకంటే ఇక ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఓంకార్. ఇక ఎప్పుడూ వినూత్నమైన కాన్సెప్ట్ తో కూడిన బుల్లితెర కార్యక్రమాలను ప్రారంభిస్తు అటు ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటాడు. కొన్ని రోజుల నుంచి మా టీవీ లో వరుసగా ప్రోగ్రాం ల తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ఇటీవలే మాటీవీలో డాన్స్ ప్లస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు ఓంకార్.


 సాధారణంగా ఓంకార్ షోస్ అన్నీకూడా ఎమోషన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కంటెస్టెంట్స్ ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం తమ బాధలు చెప్పుకోవడం లాంటివి చూస్తూ ఉంటాం ఓంకార్ షోస్ లో . ఇక ఇటీవల డాన్స్ ప్లస్ లో కూడా ఇలాంటివి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొన్ని కొన్ని సార్లు కొన్ని ప్రోమోలు ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరిగే విధంగా సోషల్ మీడియాలో వదులుతున్నారు డాన్స్ ప్లస్ షో నిర్వాహకులు. అయితే ఇటీవలే విడుదలైన డాన్స్ ప్లస్ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమోలో భాగంగా యాంకర్ ఓంకార్ జడ్జిగా ఉన్న రఘు మాస్టర్ కి వార్నింగ్ ఇస్తాడు.


 డాన్స్ ప్లస్ లో భాగంగా ఇటీవలే విడుదలైన ప్రోమోలో... రఘు మాస్టర్ టీం నుంచి ఒక కంటెస్టెంట్ వచ్చి డాన్స్ చేస్తుంది. నాలో ఆశలకు నాలో ఊసులకు అంటూ ఒక పాట పై డాన్స్ చేస్తారు. ఈ క్రమంలోనే స్టేజిపై దిగజారిపోతుంది. దీంతో వెంటనే స్పందించిన రఘు మాస్టర్ పర్ఫామెన్స్ ఆపివేయాలి అంటూ సైగ చేస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. అయితే వెంటనే స్టేజి మీదికి వచ్చిన ఓంకార్.. ఎందుకు పర్ఫామెన్స్ ఆపమని చెప్పారు అంటూ ప్రశ్నించాడు.. స్టేజి మీద పూర్తిగా స్నో ఉందని అందుకే జారిపడి పోతారని ముందుగానే చెబుతున్నామని కానీ అలాగే పర్ఫామెన్స్ స్టార్ట్ చేశారు అని.. చెబుతాడు రఘు మాస్టర్. పర్ఫామెన్స్ జరుగుతున్న సమయంలో ఆపే హక్కు ఉన్నప్పుడు ఇక పర్ఫామెన్స్ ముందే ఆపే దమ్ము మీకు లేదా  అంటూ వార్నింగ్ ఇస్తాడు ఓంకార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: