ఆచార్య రిలీజ్ రోజే.. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ..?
ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏ సినిమా వచ్చినా కూడా యూత్ అందరూ ఆ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే శేఖర్ కమ్ముల సినిమాలో హంగు ఆర్భాటాలు ఎక్కడా కనిపించవు.. కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా నిజ జీవితానికి దగ్గరగా ఉండే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఇక శేఖర్ కమ్ముల సినిమాలో ప్రతి నటుడు కూడా తమ పాత్రలలో లీనమై మరి నటిస్తూ ఉంటాడు. అయితే ఇటీవల కాలంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా తెరకెక్కింది. అక్కినేని హీరో నాగచైతన్య నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా ఈ సినిమా తెరకెక్కింది.
సినిమా విడుదలకు సంబంధించి అన్ని సన్నాహాలు కూడా జరిగాయి. ముందుగా అనుకున్న ప్రకారం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. అయితే లవ్ స్టోరీ రిలీజ్ డేట్ పై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇటీవల టాలీవుడ్లో ఆసక్తికర టాక్ వినిపిస్తోంది. మే 13వ తేదీన చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా విడుదల కావాల్సి ఉండగా వైరస్ కారణంగా వాయిదా పడింది అయితే లవ్ స్టోరీ చిత్ర బృందం ఇదే రోజున తమ సినిమాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.