తన తదుపరి సినిమా ఎవరితో చెయ్యాలో క్లారిటీ లేక త్రివిక్రమ్ ఫుల్ డిస్టర్బ్ గా వున్నాడట....

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీ లో స్టార్ హీరోస్ కి వాళ్ళ ఫ్యాన్స్ కి మర్చిపోలేని హిట్స్ ని ఇచ్చాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వాళ్ళ కెరీర్ లోనే బెస్ట్ హిట్స్ ని ఇచ్చాడు త్రివిక్రమ్. ఇక ఎన్టీఆర్ కి "అరవింద సమేత వీర రాఘవ" సినిమాతో ఎన్టీఆర్ కేరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ని ఇచ్చాడు. ఆ సినిమా 175 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఆ నమ్మకంతోనే ఎన్టీఆర్ తన 30 వ సినిమాని త్రివిక్రమ్ తో చెయ్యాలని అనుకున్నాడు.ఈ సినిమా వివిధ కారణాల వల్ల రద్దు అయిపోయిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ సినిమా రద్దు అని చాలా రోజుల నుండి వార్తలొచ్చినా.. ఇటీవల కొరటాలతో సినిమా ఉంటుందని ప్రకటించేసరికి ఎన్టీఆర్ కి ఫుల్‌ క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ తన 30 వ సినిమా విషయంలో క్లారిటీగా వున్నాడు.


ఇక అల్లు అర్జున్ తన 19 వ సినిమా కొరటాలతో ఉంటుందా అని డైలమాలో పడితే ఆ సినిమా నిర్మాణ సంస్థ యువ సుధ ఆర్ట్స్‌ 'తప్పక ఉంటుంది' అని ప్రకటించి క్లారిటీ ఇచ్చేసింది. ఈలోగా బన్నీ… తన 'పుష్ప' 'ఐకాన్‌' సినిమాలు పూర్తి చేస్తాడని అంటున్నారు.సో ఈ విషయంలో బన్నీకి కూడా క్లారిటీ వచ్చేసింది.  ఇక క్లారిటీ & కన్ఫర్మేషన్‌ రావాల్సింది త్రివిక్రమ్‌ గురించే.ఎన్టీఆర్‌ సినిమా ఉండటంతో కొత్త సినిమా ప్రారంభించకపోయినా తర్వాత అది ఉందిలే అనుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా లేదు. దీంతో మహేష్‌ సినిమా అంటున్నారు. అయితే దీనిపై బలమైన పుకార్లు రావడం లేదు. అలాగే క్లారిటీ కూడా రావడం లేదు. త్వరలో ప్రకటిస్తాడు అంటున్నారు కానీ ప్రకటించడం లేదు. పక్కాగా ఉండుంటే.. ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ సినిమా ప్రకటించిన రోజే దీని ప్రకటనా రావాల్సింది. కాని ప్రకటన రాలేదు. దీంతో ఎవరితో చెయ్యాలో ఏం చెయ్యాలో తెలీక త్రివిక్రమ్ ఫుల్ డిస్టర్బ్ గా వున్నాడట...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: