ఆ క్షణాలను డబ్బుతో వెలకట్టలేం : అనుష్క శర్మ
అయితే విరాట్ కోహ్లీ అనుష్క జంట అమితమైన జంతు ప్రేమికులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా శునకాలు అంటే ఈ జంటకు ఎంతగానో ప్రేమ. ఇక తమ ఇంట్లో కుక్కల ని పెంచుకోవడమే కాదు ఆకలితో ఉన్న శునకాలకు వివిధ రకాల మూగజీవాల కి ఆహారం అందించి ఎప్పుడు పెద్దమనసు చాటుకుంటూ ఉంటుంది ఈ జంట. అయితే గత ఏడాది కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ఏర్పడిన సమయంలో చాలా కాలం పాటు క్రికెట్ మ్యాచ్ లు సినిమా షూటింగ్లు లేకపోవడంతో విరుష్క జోడి ఇంట్లోనే ఉంటూ సరదాగా గడిపింది. ఇక అప్పట్లో దుకాణాలు మొత్తం మూతపడడంతో ఇక వీధుల్లో ఉండే ఎన్నో కుక్కలు ఆహారం దొరక్క అలమటించి పోయిన సంఘటనలు కూడా చూశాము. అయితే ఇలాంటి సమయంలోనే విరుష్క జంట తమ పెంపుడు కుక్కలతో గ్రామీణ ప్రాంతాల్లో కి వెళ్ళింది.
అంతేకాదు అక్కడ ఆహారం దొరకక అలమటించి పోతున్న వీధి కుక్కలకు ఆహారాన్ని అందజేసి తమ పెద్దమనసు చాటుకుంది విరుష్క జంట . స్వయంగా తమ చేతులతోనే శునకాలకు ఆహారాన్ని అందించింది ఈ జంట. దీనికి సంబంధించిన వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక గత ఏడాది జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ శూనకాలతో గడిపిన క్షణాలు ఎంతో ప్రత్యేకమైనవి అంటూ అనుష్క శర్మ తెలిపారు. గత ఏడాది క్షణాలను డబ్బుతో విలువ కట్టలేం అంటూ ఒక వ్యాఖ్య జత చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది అనుష్క శర్మ. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.