సూపర్ స్టార్ క్రిష్ణ తన సెంటిమెంట్ అంటున్న ఆలీ..?

Satya
ఆలీ బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మెల్లగా చిన్న పాత్రలు వేస్తూ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఆలీని హీరోని చేసిన ఘనత నాటి టాప్ డైరెక్టర్ ఎస్వీ క్రిష్ణారెడ్డిది అని చెప్పాలి.
ఆయన యమలీల మూవీని ఆలీని సౌందర్యని హీరోహీరోయిన్లుగా పెట్టి తీశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీ లో గెస్ట్ అప్పియరెన్స్ గా సూపర్ స్టార్ క్రిష్ణ ఒక పాటలో నటించారు. ఆ సాంగ్ జుంబారే అంటూ మంచి హుషారెత్తించే బీట్ తో సాగుతుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడానికి ఆ సాంగ్ కూడా ఒక కారణం. దాంతో అలీకి అది ఒక సెంటిమెంట్ గా మారిందట.
ఆలీ ఫస్ట్ టైమ్  నిర్మాతగా మరి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని ఒక సినిమా తీస్తున్నాడు. ఈ మూవీలో కూడా సెంటిమెంట్ గా సూపర్ స్టార్ క్రిష్ణ సాంగ్ ని వాడాలని భావిస్తున్నారుట. జుంబారే సాంగ్ తోనే ఈ మూవీ స్టార్ట్ అవుతుంది అని చెబుతున్నారు. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ క్రిష్ణను తాజాగా ఈ చిత్ర యూనిట్ కలసి ఆ ముచ్చట్లు ఆయనకు చెప్పింది. అలాగే ఆలీ తాను హీరోగా చేయడానికి నిలబడడానికి సూపర్ స్టార్ క్రిష్ణ కారణమని చెబుతూ ఆయనే  తన సెంటిమెంట్ అని చెప్పుకున్నాడు. మొత్తానికి చూస్తే ఆలీ నిర్మాతగా సూపర్ హిట్ కొడతాడు అనే అంటున్నారు. ఆయనని క్రిష్ణ మనస్పూర్తిగా దీవించి పంపడంతో ఆలీకి తిరుగులేదు అని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే బాల నటుడుగా అనేక చిత్రాలో చేసి ఆలీ హిట్ అయ్యారు. క్యారెక్టర్ ఆరిస్టుగా హిట్ అయ్యారు. ఇక హీరోగా కూడా ఎన్నో సినిమాలు చేసి హిట్లు కొట్టారు. బుల్లి తెర మీద యాంకర్ గా కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. ఇపుడు నిర్మాతగా కూడా ఆలీ సక్సెస్ చూస్తారు అంటున్నారు ఆయన శ్రేయోభిలాషులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: