ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ హీరోయిన్ సమంత ల కలయికలో తెరకెక్కిన బ్లాక్బస్టర్ మూవీ రంగస్థలం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుకుమార్ దాని అనంతరం ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తో రూపొందిస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా మూవీ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాసిల్ విలన్ పాత్ర చేస్తున్నారు.
ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కానుంది. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో సుకుమార్ ఒక సినిమా చేయనున్నారంటూ ఇటీవల ప్రకటన ఇటీవల రావడం జరిగింది. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై పల్లెటూరి నేపథ్యంలో మంచి మాస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే రెండు రోజులుగా ప్రచారం అవుతున్న వార్తలను బట్టి ఆ సినిమా పూర్తిగా ఆగిపోయిందని దాని స్థానంలో సుకుమార్, రామ్ చరణ్ తో సినిమా చేయనున్నన్నారనే వార్త ప్రచారం అయింది. కాగా కొద్ది సేపటి క్రితం వీటన్నిటినీ ఖండిస్తూ ఫాల్కన్ క్రియేషన్స్ వారు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
తమ సంస్థలో సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా ఉందని, అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ఎంతో భారీస్థాయిలో రూపొందనుందని వారి ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. ప్రస్తుతం ప్రచారం అవుతున్న కథనాలు ఏమాత్రం నమ్మవద్దు అందరి అంచనాలను అందుకునేలా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని నిర్మాతలు అంటున్నారు. మరి తొలిసారిగా విజయ్ దేవరకొండ, సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి......!!