చరణ్ కు తీర్చవలసిన బాకీ గురించి ఎదురు చూస్తున్న నాగబాబు !

Seetha Sailaja
చిరంజీవి తమ్ముడుగా గుర్తింపు తెచ్చుకోకుండా నాగబాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకున్నాడు. నటుడుగా టివి కార్యక్రమాల జడ్జిగా నిర్మాతగా విభిన్న బాధ్యతలను నాగబాబు నిర్వర్తిస్తున్నాడు. అయితే నటుడుగా టివి కార్యక్రమాల జడ్జిగా నాగబాబు రాణించాడు కానీ నిర్మాతగా అతడు ఏమాత్రం రాణించలేకపోయాడు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రుద్రవీణ'తో నిర్మాతగా మారిన నాగబాబు అప్పటి నుంచి ‘త్రినేత్రుడు' ‘ముగ్గురు మొనగాళ్లు' ‘కౌరవుడు' ‘బావగారూ బాగున్నారా' ‘గుడుంబా శంకర్' ‘స్టాలిన్' ‘ఆరెంజ్' ‘నా పేరు సూర్య' లాంటి అనేక సినిమాలు తీసాడు. ఈ సినిమాల్లో ఒక్క ‘బావగారు బాగున్నారా’ తప్ప మిగతా సినిమాలు అన్నీ ఫెయిల్ అయ్యాయి. భారీ సినిమాల నిర్మాతగా మారాలని నాగబాబు చేసిన ప్రయత్నాలు అన్నీ కలిసిరాలేదు.

దీనితో తాను సినిమా నిర్మాణానికి పనికిరాను అన్న విషయం తనకు చాల ఆలస్యంగా తెలిసిందే అని అంటున్నాడు. ఇదే సందర్భంలో తనకు భారీ నష్టాలను మిగిల్చిన ‘ఆరెంజ్’ సినిమా గురించి మాట్లాడుతూ నాగబాబు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఈమూవీని ‘మగధీర’ సినిమా తరువాత తాను రామ్ చరణ్ తో నిర్మిస్తున్న పరిస్థితులలో ఈ మూవీ పై భారీ పెట్టుబడి పెట్టి చాల ఆశలు పెట్టుకున్న అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు.

అయితే ఈమూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఈమూవీ వల్ల తనకు అప్పట్లో వచ్చిన భారీ నష్టాలను గుర్తుకు చేసుకుంటూ ఆ నష్టాలను తీర్చడంలో తన అన్న చిరంజీవి తనకు ఎంతో సహాయం చేసాడని చిరంజీవి సహకారం అప్పట్లో తనకు లభించకుండా ఉండి ఉంటే తాను ఆ కష్టాల నుండి బయట పడలేకపోయేవాడిని అంటూ కామెంట్ చేసాడు. ఇదే సందర్భంలో ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ కు ఇవ్వవలసిన పారితోషికం తాను ఇప్పటివరకు ఇవ్వలేదని చరణ్ కు తీర్చవలసిన ఆ బాకీ ఎప్పటికి తీరుతుందో తనకు తెలియదు అంటూ తన పై తానే జోక్ చేసుకున్నాడు..    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: