మరోసారి చంద్రబాబు ని రెచ్చగొట్టిన వర్మ.. ఏమన్నారో తెలుసా..?
ఇప్పటికే చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ను ఎలా వెన్నుపోటు పొడిచాడు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఇక లక్ష్మీపార్వతి వైపు నుంచి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను తెరకెక్కించి సంచలనం సృష్టించారు రాంగోపాల్ వర్మ. ఈ సినిమా అప్పట్లో ఎన్నో వివాదాలకు కారణం అయింది. ఏకంగా ఇక చంద్రబాబు దిగి వచ్చి ఈ సినిమా విడుదలను అడ్డుకున్నాడు కూడా. ఇక ఆ తర్వాత అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా ఓ వైపు జగన్ ఎదిగిన తీరు చూపించడమే కాదు మరోవైపు చంద్రబాబు చేసిన మోసాలను కూడా చూపిస్తూ మరోసారి సంచలనం సృష్టించారు. ఇక ఈ సినిమా కూడా అటు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో సంచలనం సృష్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇక గత కొన్ని రోజుల నుంచి ఎలాంటి సంచలన విమర్శలు చేయకుండా సైలెంట్ గానే ఉండి పోయిన రామ్ గోపాల్ వర్మ ఇక ఇటీవలే చంద్రబాబు లోకేష్ లను టార్గెట్ చేస్తూ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు. టిడిపి కి నారా లోకేష్ అనే వైరస్ పట్టిందని.. అది ప్రాణాంతక వ్యాధి అని.. ఈ వైరస్ నివారణకు పనిచేసే టీకా తారక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వర్మ. టిడిపి కార్యకర్తలు తన సలహా విని త్వరలోనే టిడిపి పార్టీకి తారక్ అనే టీకా వేయాలి అని సూచించారు. లేదంటే మీరందరూ కూడా ఆ వైరస్ బారినపడి చనిపోతారని ఇప్పటికే చంద్రబాబు ఇన్ఫెక్ట్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వర్మ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోతున్నాయి