'అజ్ఞాతవాసి'
సినిమా ప్లాప్ తరువాత రాజకీయాల్లో బిజీ అయ్యి దాదాపు మూడు సంవత్సరాల తరువాత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
వేణుశ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను
దిల్ రాజు,
బోనీ కపూర్ కలిసి నిర్మించిన సంగతి తెలిసిందే.
ప్రకాష్ రాజ్, నివేద తామస్,
అంజలి,
అనన్య లు ముఖ్య పాత్రలు పోషించారు. యస్ యస్
తమన్ సంగీతం అందించాడు.ఈ
సినిమా విషయంలో అటు
పవన్ కళ్యాణ్, ఇటు
దిల్ రాజు ఇద్దరూ చాలా హ్యాపీ అయ్యారు. ఇక
పవర్ స్టార్ 'వకీల్ సాబ్' సినిమాకి రూ.50 కోట్ల రెమ్యునరేషన్.. దాంతో పాటు
సినిమా లాభాల్లో వాటాలు అనే విధంగా
పవన్ తో డీల్ కుదుర్చుకున్నాడు
దిల్ రాజు.అయితే
సినిమా విడుదలకు ముందే లాభాలతో సంబంధం లేకుండా రూ.65 కోట్లు
పవన్ కు ఇచ్చేలా సెటిల్మెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఆ విధంగా 'వకీల్ సాబ్'
సినిమా కోసం మొత్తం
పవన్ వసూలు చేసిన మొత్తం రూ.65 కోట్లు అని తెలుస్తోంది.
నటుడు
ప్రకాష్ రాజ్ కు ఈ సినిమాకి గాను
కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.
సినిమా థియేటర్, నాన్
థియేటర్ హక్కులన్నీ కలిపి రూ.150 కోట్లకు కాస్త అటు ఇటుగా
మార్కెట్ చేశారు.డిస్ట్రిబ్యూటర్ గా
దిల్ రాజు కొన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. అవి కాకుండానే రికార్డులో సినిమాకి వ్యాపారం జరిగింది.
దిల్ రాజు ఉంచుకున్న ఏరియాలు కూడా భారీ మొత్తంలో కలెక్షన్స్ రాబట్టాయి. నిర్మాతగా
దిల్ రాజుకి మొత్తం రూ.50 కోట్ల మేరకు లాభం వచ్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం.దిల్ రాజు,
పవన్ లాభాలు పడ్డ కాని బయ్యార్లకు ఇప్పుడు నష్టం వాటిల్లుతుంది.ఎందుకంటే కరోనా ప్రభావం వల్ల
థియేటర్ లు మూతపడటంతో
సినిమా నష్టాలను చూస్తుంది.