నటసింహం నందమూరి బాలయ్య సినిమా అంటే అభిమానులు కోరుకునేది భారీ ఫైట్ లు పొడవాటి డైలాగులే. కొంతమంది అయితే బాలక్రిష్ణ ఫైట్లు చూసేందుకే ఆయన సినిమాలకు వెళుతుంటారు. స్క్రీన్ పై బాలయ్య తొడకొడుతూ మీసం మెలేస్తూ ఫైట్ లు చేస్తుంటే థియేటర్లో అభిమానులు విజిల్స్ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఇప్పుడు బాలయ్య ఓ ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించబోతున్నారంటూ టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రామారావు గారు అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోనే బాలక్రిష్ణ బాలయ్య నవ్వులు పూయించబోతున్నారట. ఇప్పటికే అనిల్ రావిపూడి ఇదివరకు ఎప్పుడూ చూడని పాత్రలో బాలయ్యను చూపిస్తానని అన్నారు. అయితే ఈ సినిమాలో ఎఫ్ 2 లో వెంకటేష్ మాదిరిగా నవ్వించే పాత్రలో బాలక్రిష్ణ నటించబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. మాస్ డైలాగులు చెప్పడం...భారీ ఫైట్లతో అదరగొట్టడంలో బాలయ్యకు సాటిలేదు.
కానీ బాలక్రిష్ణ ఇప్పుడు సినిమా మొత్తం నవ్వించగలరా అన్న సందేహం నెలకొంది. అంతే కాకుండా బాలయ్య కెరీర్ లో ఇప్పటివరకూ ఇలాంటి సినిమాలో నటించలేదు. మరి ఈ సినిమాతో మెప్పిస్తారా లేదా చూడాలి. ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలక్రిష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో బాలయ్యకు విలన్ గా శ్రీకాంత్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తరవాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు బాలక్రిష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ను కూడా గోపిచంద్ రెడీ చేసుకున్నాడు. అయితే ఈ సినిమాపై కూడా ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ను రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.