రేణు దేశాయ్: ఇలాంటి సమయంలో అలాంటి వీడియోలు చూడండి...?
అయితే ఓవైపు ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధులు, మరోవైపు సినీ ప్రముఖులు కరోనా గురించి అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కరోనా గురించి వ్యాఖ్యానించారు. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే..రేణు దేశాయ్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ... తరచూ ఏదో ఒక న్యూస్ తో హాట్ టాపిక్ గా ఉంటారు. ఆసక్తికర విషయాలను తన ఫాలోవర్స్‌తో పంచుకోవడంలో ముందుంటారు రేణు. అయితే తాజాగా ఈమె కరోనా గురించి మాట్లాడుతూ ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందించిన ఈమె ఏమన్నారంటే.. ఇప్పటివరకు దుఃఖాలను ద్వేషాలను, మోసి... మోసి గాడిదలుగా అయిపోతున్నాము.
మనం ఈ జీవితం పొందింది, ఈ దేహం ఉన్నది కేవలం సమస్యలను మోస్తూ బాధపడటానికి మాత్రమే కాదు... ఎన్ని ఇబ్బందులు ఉన్నా అందులో కూడా ఏదో ఒక మూల సంతోషం దాగి ఉంటుంది. ఆ సంతోషాన్ని గుర్తించి ఆనందంగా బ్రతకాలి. ఇప్పుడు మనమంతా చావుకి, భయానికి మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. భయపడకండి, బాధపడకండి. సమయాన్ని ఆనందంగా గడపండి. మిమ్మల్ని సంతోషపరిచే కామెడీ వీడియోలను చూస్తూ సమాయన్ని గడపండి. ఎటువంటి కష్టాలు అయినా ఎంతో కాలం ఉండవు...త్వరగానే గడిచిపోతుంది... అదే కాలం యొక్క విశిష్టత. ఏదీ శాశ్వతం కాదు. మీరు అన్ని జాగ్రత్తలు పాటించండి సురక్షితంగా ఉండండి... అంటూ ప్రజలకు మంచి సందేశాన్ని అందించారు రేణు దేశాయ్.