టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగులో అదే లాస్ట్ సినిమా అవ్వనుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఆ సినిమానే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా. కొండపొలంతో పాటు మరికొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో డెబ్యూ హీరోగా రికార్డ్స్ బ్రేక్ చేసిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు చక్కబడితే రిలీజ్ చేస్తారని సమాచారం. మరి ఈ సినిమా రకుల్ ప్రీత్ సింగ్‌ని టాలీవుడ్లో సక్సస్ ట్రాక్ ఎక్కిస్తుందా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్.
కెరటం సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో పేరు తెచ్చుకున్న రకుల్ ఆ తర్వాత వరసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ ఇటు టాలీవుడ్లో.. అటు కోలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగింది. మెగా హీరోలతో పాటు టాలీవుడ్ యంగ్ హీరోలతో సినిమాలు చేసి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఆసమయంలో రకుల్ రెమ్యూనరేషన్ కూడా పెద్ద హాట్ టాపిక్ అయింది.అయితే పూజా హెగ్డే, కీర్తిసురేష్, రష్మిక మందన్న లాంటి హీరోయిన్స్ వచ్చి క్రేజీ స్టార్స్‌గా మారడంతో రకుల్ క్రేజ్ తగ్గిపోయింది.
బ్యాడ్ లక్ అన్నట్టుగా రకుల్ నటించిన సినిమాలు కూడా ఆసమయంలో హిట్ కాలేదు. ఇక సీనియర్ స్టార్ హీరో నాగార్జున నటించిన మన్మధుడు 2 సినిమా చేయడం.. ఆ సినిమా డిజాస్టర్ కావడం రకుల్ కెరీర్ మీద గట్టిగానే ప్రభావం చూపించింది. అయినా నితిన్‌తో చెక్ సినిమా, క్రిష్ - వైష్ణవ్ తేజ్ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. దాంతో రకుల్ మళ్ళీ టాలీవుడ్లో తన సత్తా చూపిస్తుందనుకున్నారు. కానీ చెక్ సినిమా ఫ్లాపయి చెక్ పెట్టేసింది. ఇప్పుడు రకుల్ హోప్స్ అన్నీ క్రిష్ - వైష్ణవ్ తేజ్ సినిమా మీదే అంటున్నారు. కాగా బాలీవుడ్లో మాత్రం రకుల్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్గా దూసుకుపోతోంది.. మరి తెలుగులో ఈ క్రిష్ సినిమాతోనైనా రకుల్ మళ్ళీ కం బ్యాక్ అవుతుందో లేదో చూడాలి..!!