ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తో మెగా డాటర్ ప్రయోగం ఫలిస్తుందా..?

VAMSI
మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ తేజ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇప్పుడు నెంబర్ వన్ హీరోగా దూసుకు పోతున్నాడు. పేరుకి స్టార్ కిడ్ ఇమేజ్ తో ఎంట్రీ ఇచ్చినా తన ప్రతిభతో సత్తా చాటాడు చెర్రీ. అయితే ఇప్పుడు చిరు పెద్ద కుమార్తె సుస్మిత కూడా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె హీరోయిన్ గా చేయాలనుకోవడం లేదట నిర్మాతగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమిళ చిత్రం అయిన ‘8 తొట్టకల్’ అనే సినిమా రిలీజ్ అయి ఇప్పటికి నాలుగేళ్లు గడిచింది. అప్పట్లో అది బ్లాక్ బస్టర్ గా రికార్డులు సృష్టించింది... ఇదే కథను కన్నడలో రీమేక్ చేయగా అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

అయితే ఈ స్టోరీ లైన్  బాగా నచ్చడంతో ఇప్పుడు ఈ సినిమా రీమేక్ తో తెలుగులో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారట సుస్మిత. ఇప్పటికే రీమేక్ రైట్స్ ను కూడా సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఏ హీరోతో చేయబోతున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సినిమా కథ మొత్తం ఒక తుపాకీ చుట్టూ తిరుగుతుందట. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. గతంలో చిరు మరియు చెర్రీలు నటించిన పలు సినిమాలకు సుస్మిత క్యాస్టూమ్ డిజైనర్ గా వర్క్ చేసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు.

అంతే కాకుండా ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్ కూడా నిర్మించగా, ఇప్పుడు వెండితెరపై నిర్మాతగా రాణించాలని కోరుకుంటున్నారు. మరో వైపు ప్రస్తుతం మెగా ఫ్యామిలీ లో ఎక్కువగా రీమేక్ ల హవా నడుస్తుండగా... ఇప్పుడు చిరు కుమార్తె కూడా రీమిక్ సినిమాతోనే ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న వార్త విశేషం అనే చెప్పాలి. అయితే ఈమెకు నిర్మాతగా ఈ సినిమా మంచి ఆరంభాన్ని ఇస్తుందా...? లేదా అన్నది తెలియాలంటే మరి కొంతకాలం  ఆగాల్సిందే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: