చిత్ర పరిశ్రమలో సినిమా ల రీమేక్ లు కామన్.. తెలుగు సినిమాలను హిందీలో, హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ లు జరుగుతూనే ఉన్నాయి. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి హిందీలో రీమేక్ కాగా, ఇటీవల విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన వకీల్ సాబ్ సినిమాను హిందీ పింక్ సినిమా రీమేక్.. ఇక పాటలను కూడా రీమేక్ చేస్తుంటారు. మన తెలుగు సినిమాలలోని మాస్ పాటలను హిందీలో రీమేక్ అవుతాయన్న విషయం తెలిసిందే.. తాజాగా అల్లు అర్జున్ సాంగ్ ను సల్మాన్ ఖాన్ చేశారు.
సల్మాన్‌ఖాన్ 'రాధే' వల్ల సీటీమార్ పాట హిందీ జనాల్ని ఊపేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'డీజే' ( దువ్వాడ జగన్నాథం) కోసం దేవిశ్రీప్రసాద్ పాడిన పాట ఇదే... తెలుగులో సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పటికీ వినిపిస్తుంది. అయితే ఈ పాటని మెచ్చి తన 'రాధే' సినిమాలో మరోసారి వినిపించాలని నిర్ణయించారు కండలవీరుడు సల్మాన్‌ఖాన్. ఆదివారమే ఆ పాట హిందీలో విడుదలైంది. అందులో సల్మాన్‌ఖాన్ తనదైన శైలిలో స్టెప్పులేశారు. ఈ పాట విడుదల సందర్భంగా సల్మాన్... అల్లు అర్జున్‌ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ''అల్లు అర్జున్ 'సీటీమార్..' పాటకిగానూ మీకు కృతజ్ఞతలు.
ఇందులో మీరు నటించిన విధానం, మీ డ్యాన్స్, మీ స్టైల్... అన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం'' అన్నారు. ఈ విషయం స్పందించి అల్లు అర్జున్ కూడా ప్రతి స్పందిస్తూ ''మీ నుంచి ప్రశంస ఎంతో సంతోషాన్నిచ్చింది. రాధే' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. తెరపై మ్యాజిక్ సృష్టిస్తుందని ఆశిస్తున్నా'' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుంది.. సల్మాన్ స్టెప్పులను చూసిన బన్నీ ఫ్యాన్స్ మాత్రమే ఓ రేంజులో కామెంట్లను పెడుతున్నారు. బన్నీ స్టెప్పులు ముందు సల్మాన్ స్టెప్పులు తేలిపోయాయి. అనుకున్న గ్రేస్ ను కండల వీరుడు అందించలేకపోయాడు అంటూ కామెంట్ల వర్షం కురిపించారు..దీంతో బన్నీ వర్సెస్ సల్మాన్ అయ్యింది.. ఆ పాటను మీరు ఒకసారి చూసేయండి..