100 కోట్ల క్లబ్బులో ఆరు సినిమాలు.. ఈ ఫీట్ సాధించిన ఒకే ఒక్క టాలీవుడ్ హీరో..?

frame 100 కోట్ల క్లబ్బులో ఆరు సినిమాలు.. ఈ ఫీట్ సాధించిన ఒకే ఒక్క టాలీవుడ్ హీరో..?

P.Nishanth Kumar
టాలీవుడ్లో కలెక్షన్ ను బట్టే హీరో రేంజ్ ఉంటుంది.. తమ అభిమాన నటుడి కలెక్షన్స్ ఏమాత్రం తగ్గినా అభిమానులు ఊరుకోరు. ఎంత ఖర్చయినా సరే తమ అభిమాన నటుడి సినిమా కలెక్షన్లు వేరే హీరో సినిమా కలెక్షన్ల కంటే ఎక్కువగా ఉండాలని చూస్తారు.. హీరోలు ఈ ఫిగర్ ని పట్టించుకోకపోయినా అభిమానులు మాత్రం ఈ విషయంలో ఎంతో కరాఖండిగా వ్యవహరిస్తూ ఉంటారు.. హీరోకు లేని పరువు అభిమానులకు ఎందుకో అర్థం కాదు కానీ, కోట్లు కలెక్షన్స్ సాధించిన హీరోలు మాత్రం కోట్ల కోట్ల రూపాయలు తీసుకొని ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఉన్నారు..

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో స్టార్ హీరో గా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో ఏ హీరోకి సాధ్యం కానీ అరుదైన రికార్డును నెలకొల్పాడు.. ఆయన సినిమాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు 100 కోట్ల క్లబ్ లో చేరాయి.. దీనిని బట్టి ఆయన సినిమాలు ఎంత బాగుంటాయో అర్థం చేసుకోవచ్చు.. భారీ ఫ్యాన్ పేస్ ఉన్న హీరో కూడా మహేష్ అవడంతో ఈ ఫీట్ ని సాధించిన ఒకే ఒక్క టాలీవుడ్ హీరో అయ్యాడు.. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 220 కోట్ల వసూళ్లు సాధించి, మహేష్ కెరీర్లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచింది.. మహేష్ తన కెరీర్ లో మంచి చిత్రంగా చెప్పుకునే భరత్ అనే నేను సినిమా బాక్సాఫీస్ వద్ద 187 కోట్ల రూపాయలు వసూలు చేసింది.. అలాగే మహేష్ కెరీర్లో 25 సినిమాగా ఎంతో ప్రత్యేకంగా తెరకెక్కిన సినిమా మహర్షి 187 కోట్ల వసూలు సాధించింది.. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా శ్రీమంతుడు 160 కోట్ల వసూళ్లను సాధించగా, మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ సినిమా 150 కోట్ల వసూళ్లు సాధించి అప్పట్లో మంచి రికార్డును నెలకొల్పింది.. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా ఏకంగా 150 కోట్లను రాబట్టి అప్పటికీ మహేష్ నటించిన చిత్రాలలో ది బెస్ట్ చిత్రంగా నిలిచింది.. ఏదేమైనా ఈ ఫీట్ సాధించిన మొదటి టాలీవుడ్ హీరో మహేష్ బాబు కావడం టాలీవుడ్ కి గర్వకారణం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: