కథ,మాటలు, స్క్రీన్ ప్లే... త్రివిక్రమ్.. మరి డైరెక్షన్ సంగతేంటి..??

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి ఎలాంటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా తన సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ త్రివిక్రమ్ చూసుకుంటాడన్న సంగతి తెలిసిందే. కానీ.. ఇప్పుడు డైరెక్షన్ తప్ప.. మిగిలిన మూడు మాత్రమే చేస్తున్నాడు! ఇండస్ట్రీలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.త్రివిక్రమ్ లాస్ట్ మూవీ 'అలవైకుంఠ పురములో'.ఈ మూవీ గతేడాది విడుదలైంది. అప్పట్నుంచి ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కానీ.. తీరా ఏడాది కాలం గడిచిపోయిన తర్వాత కొరటాల శివతో కలిసిపోయాడు జూనియర్‌. అయితే..


 జూనియర్ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఖాళీగా ఉండకుండా.. గతంలోనే పవన్‌-రానా రీమేక్ మూవీకి మాటలు రాయడం మొదలు పెట్టారు. ఈ చిత్రం స్క్రీన్ ప్లే బాధ్యతలు కూడా చూసే ఛాన్స్ ఉంది.ఇక, పవర్ స్టార్ కోసం 'కోబలి' కథను ఎప్పుడో పదేళ్ల క్రితం సిద్ధం చేశాడు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందువల్ల స్టోరీలో కూడా ఛేంజెస్ కంపల్సరీ అయ్యాయి. అయితే.. ఆ స్టోరీని మరో హీరో కోసం ఇంకో డైరెక్టర్ కు అప్పగిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.మరోవైపు.. జూనియర్ తో సినిమా ఆగిపోవడంతో.. మహేష్ తో హ్యాట్రిక్ మూవీ ఆల్మోస్ట్ కన్ఫామ్ అన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ.
.


 అది నిజమేనంటూ ఎవ్వరూ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో.. అదో వార్తగానే మిగిలిపోయింది. ఇటు తన ఫేవరెట్ హీరో వెంకటేష్ కోసం ఓ కథ రాస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ 75 మూవీకి త్రివిక్రమ్ స్టోరీ అందిస్తున్నట్టు చెబుతున్నారు.ఈ విధంగా త్రివిక్రమ్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు తప్ప.. డైరెక్షన్ మాత్రం చేయట్లేదు. అది ఎప్పుడు మొదలు పెడతారో కూడా ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. దీంతో.. రాబోయే పలు చిత్రాల టైటిల్ కార్డ్స్ లో త్రివిక్రమ్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అని కనిపించే అవకాశాలు మాత్రమే ఉన్నాయి.. మరి డైరెక్షన్ సంగతి ఏంటయ్యా.. అంటే.. మరి అది గురూజీకే తెలియాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: