దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. అంతే కాకుండా మరణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడుతోంది. అంతే కాకుండా వైద్యానికి అవసరమైన ఔషదాలు మరియు ఆక్సిజన్ కొరత కూడా భారీగా ఏర్పడింది. అయితే ప్రభుత్వం నాయకులు మాత్రంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజీ అయ్యారు. దీని విషయమై పలువురు రాజకీయ నాయకులు సెలబ్రెటీలు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్షించారు. వారిలో ప్రముఖ హీరో సిద్ధార్థ్ కూడా ఒకరు. సోషల్ మీడియాలో సిద్ధార్థ్ మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న సెలబ్రెటీలు ఈ హర్రర్ షోను చూస్తు కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ల లెక్కలు వాళ్లకు ఉన్నాయి. మరి మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు. అంటూ ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
అయితే తాజాగా ఈ రోజు సిద్ధార్థ్ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ట్వీట్ చేయడం సంచలనం రేపింది. తనతో పాటు తన కుంటుంబ సంభ్యులకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. అంతే కాకుండా తమిళనాడు బీజేపీ సెల్ తన ఫోన్ నంబర్ ను భయటకు లీక్ చేసిందంటూ సిద్దార్థ్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. 24గంటల్లో తనకు దాదాపు 500 లకు పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయని సిద్ధార్థ్ ట్వీట్ లో పేర్కొన్నారు. తనను తన కుంటుంబ సభ్యులను రేప్ చేస్తామని..చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ సిద్దార్థ్ ఆవేదన వ్యక్తం చేసారు. అంతే కాకుండా తనకు వచ్చిన ఫోన్ కాల్స్ అన్నీ రికార్డ్ చేసినట్టు సిద్ధార్థ్ తెలిపారు. వాటిని పోలీసుల మందు పెడతానని తెలిపారు. తనకు బెదిరింపు మెసేజ్ లు వస్తున్న నంబర్ లు బీజేపీ లింకులు ఉన్నవేనని అన్నారు. బీజేపీ జండాలు..గుర్తులు డీపీలు గా ఉన్న నంబర్ ల నుండే బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. అంతే కాకుండా సిద్ధార్థ్ తన ట్వీట్ లో ప్రధాని మోడీ మరియు అమిత్ షాలకు ట్యాగ్ చేశారు.