ఆ సముద్రంలోకి వెళ్లినా ఎవరు మునిగిపోరట.. ఎక్కడంటే..?
ఇక ఇటీవలే కూడా మరో సరికొత్త కాన్సెప్టుతో తెర మీదికి వచ్చాడు సాయి కుమార్. ఇటీవలే వాబ్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో లో భాగంగా నలుగురు కూడా సింగర్స్ గెస్ట్ లుగా ఎంట్రీ ఇవ్వడం తో ఇక వావ్ స్టేజ్ మొత్తం సంగీతంతో మారుమోగిపోయింది అనే చెప్పాలి. ధనుంజయ్, దినకర్,సాహితి, సోనీ అనే నలుగురు సింగర్స్ కూడా వావ్ కార్యక్రమానికి గెస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగానే హోస్ట్ సాయికుమార్ తనదైన శైలిలో ప్రశ్నలు అడుగుతూ అందరిని ఎంటర్టైన్మెంట్ పంచాడు. ఈ క్రమంలోనే ఇక ఒక టాస్క్ లో భాగంగా కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు సాయికుమార్.
ఇటీవల కనుగొన్న పురాతన బీర్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించగా అందరూ ఒక్కసారిగా తెల్లమొహం వేస్తారు. అంతే కాకుండా సముద్ర నీటి లోకి వెళ్లినప్పటికీ మనిషి మునిగి పోకుండా ఉండే సముద్రం ఏది అంటూ ప్రశ్నించడంతో ఎవరికీ సమాధానం తెలియక పోవడంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అందరు సింగర్స్. అయితే ఇక ఈ ప్రశ్న అడగగానే ఈ ప్రోమో చూస్తున్న బుల్లితెర ప్రేక్షకులు అందరిలో కూడా ఎంతగానో ఆసక్తి పెరిగిపోయింది. మనిషి సముద్రం లో కి వెళ్లి పోయినప్పటికీ మనిషి నీటిపై తేలే సముద్రం కూడా ఉంటుందా.. ఉంటే అది ఎక్కడ ఉంది అని తెలుసుకునే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. అయితే దీనికి సంబంధించిన సమాధానాలు మాత్రం రివీల్ చేయలేదు. ఒకవేళ దీనికి సంబంధించిన సమాధానం తెలుసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఈ మంగళవారం ప్రసారమయ్యే వావ్ కార్యక్రమం చూడాల్సిందే మరి.